https://oktelugu.com/

Pawan Kalyan: సరికొత్త లుక్ లో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..ఒక్కోరోజు ఒక్కోలా కనిపిస్తున్నాడుగా!

కోరమీసం తో పూర్తిగా ఆయన 'హరి హర వీరమల్లు' లుక్ లోకి వచ్చేసాడు. ఆరు సంవత్సరాల నుండి సెట్స్ మీద ఉన్నటువంటి ఈ చిత్రం ఎట్టకేలకు చివరి షెడ్యూల్ లోకి అడుగుపెట్టింది. ఈ వారంతో షూటింగ్ మొత్తం పూర్తి కాబోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 4, 2024 / 11:29 AM IST

    Pawan Kalyan(46)

    Follow us on

    Pawan Kalyan: ఎన్నికలు పూర్తయిన దగ్గర నుండి పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎంత బిజీ గా ఉన్నాడో, ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడో, నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ ట్రెండింగ్ లో ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన గెటప్ కూడా మార్చలేదు. గెడ్డం లుక్ లోనే ఇన్ని రోజులు మనం చూసాము. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లో కూడా ఆయన ఇదే లుక్ తో పాల్గొన్నాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ లో స్టెల్లా అనే విదేశీ నౌకాని అక్రమ రవాణా జరగకుండా ఆపిన ఘటన నేషనల్ వైడ్ గా ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో మనమంతా చూసాము. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు నుండి ఆయన మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నాడు. నిన్న రాత్రి ఆయన షూటింగ్ విజయవాడ కి విచ్చేశాడు. ఆ సమయంలో విమానాశ్రయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    కోరమీసం తో పూర్తిగా ఆయన ‘హరి హర వీరమల్లు’ లుక్ లోకి వచ్చేసాడు. ఆరు సంవత్సరాల నుండి సెట్స్ మీద ఉన్నటువంటి ఈ చిత్రం ఎట్టకేలకు చివరి షెడ్యూల్ లోకి అడుగుపెట్టింది. ఈ వారంతో షూటింగ్ మొత్తం పూర్తి కాబోతుంది. వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల అవ్వబోతున్న ఈ సినిమానే పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా చూడొచ్చు. అంతకు ముందు ఆయన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసాడు కానీ, ఆ సినిమా పూర్తి స్థాయి పాన్ ఇండియన్ సినిమా లాగా అనిపించలేదు. కానీ ‘హరి హర వీరమల్లు’ మాత్రం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి తగ్గట్టుగా తీసిన సినిమా.

    ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు గ్లిమ్స్ వీడియోలు ఒక టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. వీటికి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ లుక్స్, గెటప్ అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ నెల రెండవ వారంలో ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాటని విడుదల చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ స్వయంగా గాత్రం అందించిన ఈ పాట సినిమాపై అంచనాలను వేరే లెవెల్ లో పెంచేలా ఉంటుందట. పవన్ కళ్యాణ్ ఇందులో రెండు విభిన్నమైన గెటప్స్, 30 అట్టైర్స్ తో కనిపించబోతున్నాడట. త్వరలోనే వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని కూడా పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తాడో చూడాలి. పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించిన ఆయనకి ఈ చిత్రం సినిమాల పరంగా కూడా కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి.