
బుల్లితెర యాంకర్స్ అనగానే.. మెజారిటీ ప్రేక్షకుల మదిలో ముందుగా మెదిలే పేర్లు అనసూయ, రష్మిక ఉంటాయి. అంతలా.. పాపులారిటీ సాధించారీ ఇద్దరు యాంకర్లు. తమ మాట తీరుతో, యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తూ.. స్మాల్ స్క్రీన్ ను దున్నేస్తున్నారు. వీళ్లకు ఈ టీవీ.. ఆ టీవీ, ఈ షో.. ఆ షో అన్నది లేదు. సర్వం అనసూయ, రష్మిక మయం అయిపోయింది. ఆ విధంగా.. ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ దూసుకెళ్తున్నారు. అయితే.. వీరిద్దరూ కలిసి ఓ క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎంబీఏ కంప్లీట్ చేసి.. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ.. ఆ తర్వాత ఊహించని విధంగా జబర్దస్త్ షోలో యాంకర్ ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత వెను దిరిగిచూసుకోలేదు. టెలివిజన్ స్క్రీన్ పై తనదైన ముద్రవేసిన అనూ.. ఆ తర్వాత వెండితెరపైనా తన టాలెంట్ చూపిస్తోంది. ఈ అమ్మడి పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోయిన మేకర్స్ పవర్ ఫుల్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో కలిపి ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాల వరకు ఉన్నాయి. అదే సమయంలో బుల్లి తెరను వదిలే ప్రసక్తే లేదని చెబుతోంది. ఈ విధంగా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది.
అటు రష్మి గురించి చూస్తే.. సినిమాలపై ఆసక్తితోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదట్లో కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది. కానీ.. తగినంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత యాంకర్ గా మారిపోయింది. అనసూయ ఆ మధ్య జబర్దస్త్ ను కొంత కాలం వదిలేయడంతో.. రష్మి పగ్గాలు చేపట్టింది. సక్సెస్ ఫుల్ గా రన్ చేసి, హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ రావడంతో.. చెరోదాన్ని మెయింటెన్ చేస్తున్నారు.
అయితే.. ఒకే ప్రొఫెషన్లో ఉన్నవాళ్ల మధ్య కాంపిటేషన్ ఉండడం సర్వ సాధారణం. ఇదే పోటీ వీరిద్దరి మధ్య కూడా ఉండొచ్చు. అయితే.. స్టేజీ షోలలో వీళ్ల పోటీని కూడా స్కిట్ లో భాగంగా చూపించడంతో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఇగో పోరాటం సాగిస్తున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అందులో వాస్తవం ఎంత అనేది తెలియదుగానీ.. అవన్నీ పక్కనపెట్టి వీళ్లిద్దరూ కలిసి ఓ క్రేజీ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారట. ఇప్పుడీ వార్త బుల్లితెర సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అది కూడా మల్లెమాల సంస్థనే నిర్మిస్తోందని, ఉమెన్ సెంట్రిక్ సిరీస్ లో వీళ్లు కలిసి నటించబోతున్నారని అంటున్నారు. మరి, ఇందులో వాస్తవం ఎంత అనేది చూడాలి.