Anchor Suma: ఆ ఒక్క పని చెయ్యలేకపోయినా సుమ.. ముసలిది అయింది అంటూ?

Anchor Suma: టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా నిలిచిన సుమ గురించి అందరికీ తెలిసిందే. తన యాంకరింగ్ తో ఎంతోమందిని ఆకట్టుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది సుమ. ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.. చేస్తూనే ఉంది. ఇక వెండితెరపై సినీ ఈవెంట్లలో కూడా హోస్టింగ్ తో బాగా సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆ ఒక్క పని చేయలేకపోయింది సుమ. సుమ లేటు వయసులో కూడా […]

Written By: Navya, Updated On : September 14, 2021 11:51 am
Follow us on

Anchor Suma: టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా నిలిచిన సుమ గురించి అందరికీ తెలిసిందే. తన యాంకరింగ్ తో ఎంతోమందిని ఆకట్టుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది సుమ. ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.. చేస్తూనే ఉంది. ఇక వెండితెరపై సినీ ఈవెంట్లలో కూడా హోస్టింగ్ తో బాగా సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆ ఒక్క పని చేయలేకపోయింది సుమ.

సుమ లేటు వయసులో కూడా యంగ్ లా కనిపిస్తుంటుంది. ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తను చేసే ప్రతి ఒక్క షోలలో చివరి వరకు అలసిపోకుండా ఎంతో ఎనర్జీ గా కనిపిస్తుంది. ఈమధ్య సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. యూట్యూబ్ లో కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోని అందులో కొన్ని రకాల ఎంటర్టైన్మెంట్ షోలను, వంటల షోలను చేసి తన మాటలతో బాగా సందడి చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తనని ముసలిది అంటూ ఓ కామెంట్ ఎదుర్కొంది. తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. అందులో తరుణ్ మాస్టర్, శివ శంకర్ మాస్టర్, అమ్మ రాజ శేఖర్ మాస్టర్, పాపీ మాస్టర్ లు గెస్ట్ గా పాల్గొని బాగా సందడి చేశారు. అమ్మ రాజశేఖర్ తన కామెడీతో బాగా నవ్వించాడు. ఇక సుమ అందరికీ ఒక టాస్క్ ఇచ్చింది. ఎవరైతే తమ చేతులతో కాలి బొటనవేలు పట్టుకుంటారో వాళ్లకు యాభై వేలు ఇస్తా అని ఆఫర్ చేసింది.

దీంతో అమ్మ రాజశేఖర్ ఆంబులెన్స్ రెడీ చేసుకోవాలి అంటూ పంచ్ వేశాడు. ఇక తరుణ్ మాస్టర్ ఆ టాస్క్ చెయ్యలేక పోయేసరికి ఓసారి సుమను ప్రయత్నించమని కోరారు. ఇక సుమ ఎంత ప్రయత్నించినా తన చేతులతో తన కాళ్లను తాకలేకపోగా కింద పడింది. వెంటనే ఇలా చేస్తారా నన్ను అంటూ నవ్వుతూ కామెంట్ చేసింది. దీంతో ఈ ప్రోమో ని చూసిన నెటిజన్లు అప్పుడే ముసల్ది అయ్యింది అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.