Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాక్ అప్’ రియాలిటీ షోకి సిద్ధమవుతున్నారు. బిగ్ బాస్ షోని పోలిన లాక్ అప్ షో సరికొత్తగా రూపొందించారు. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో విరామం లేకుండా నిరంతరం ఈ షో ప్రసారం కానుంది. లాక్ అప్ షో ట్రైలర్ ని ఢిల్లీలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హోస్ట్ కంగనా, నిర్మాత ఏక్తా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాక్ అప్ షోలో మీరు ఎవరిని లాక్ చేయాలని కోరుకుంటున్నారు? అని అడుగగా… దర్శక నిర్మాత కరణ్ జోహార్ పేరు చెప్పారు కంగనా. నా జైలులో నా బెస్ట్ ఫ్రెండ్ కరణ్ జోహార్ ని బంధించాలని అనుకుంటున్నానని సమాధానం చెప్పారు.

కంగనా ఇంకా మాట్లాడుతూ ఇలాంటి ఆసక్తికరమైన, ఉత్కంఠరేపే షోని హోస్ట్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. లాక్ అప్ రియాలిటీ షోతో అది కుదిరింది అన్నారు. లాక్ అప్ షో కాన్సెప్ట్ నాకెంతగానో నచ్చింది. ఏక్తా కపూర్ షోని అద్భుతంగా రూపొందించారు. అందుకే ఈ షోకి హోస్ట్ బాధ్యతలు తీసుకున్నాను, అన్నారు.
Also Read: పవన్ దెబ్బకు చెల్లాచెదురు.. తలలు పట్టుకున్న మిగిలిన హీరోలు !
ఇక అమితాబ్, సల్మాన్ వంటి స్టార్స్ ఇప్పటికే పాప్యులర్ రియాలిటీ షోలు చేశారు, వారి నుండి మీరు స్ఫూర్తి పొందుతారా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కంగనా… నేను ఎవరిని స్ఫూర్తిగా తీసుకోను. అది కూడా ఒక రియాలిటీ షోకి వేరొకరిని అనుకరించకూడదు. మనం మనలాగే ఉండాలి. ఒకరిని అనుకరించడం, స్ఫూర్తిగా తీసుకోవడం నాకు గౌరవం కాదన్నారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత ఏక్తా కపూర్ మాట్లాడారు. ఆమె రిపోర్టర్ ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోతో ఎటువంటి పోలిక ఉండదు అన్నారు. రియాలిటీ షో అనగానే ఇలాంటి పోలికలు సర్వసాధారణం. కానీ మా షోని సరికొత్తగా రూపొందించాము. ఇక లాక్ అప్ షో హోస్ట్ గా నా ఫస్ట్ ఛాయిస్ కంగనానే. అందుకే ఆమెను తీసుకోవడం జరిగింది, అన్నారు.
లాక్ అప్ షో కంటెస్టెంట్స్ మధ్య ఇంటెన్స్ డ్రామా, కాంట్రవర్సీ నడవనుంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొనే ఈ షో ఫిబ్రవరి 27 నుండి ఏ ఎల్ టి బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ లో ప్రసారం కానుంది. 24/7 నాన్ స్టాప్ గా ప్రసారం కానుంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రసారం కానున్న లాక్ అప్ షోలో మసాలా డోసు మరింత ఉండే అవకాశం కలదు.
Also Read: ఈ అలవాట్లు మీకు ఉన్నాయా.. చాణక్య నీతి ప్రకారం పేదరికంతో బాధ పడాల్సిందే?