Anchor Suma viral video: యాంకరింగ్ రంగంలో గత రెండున్నర దశాబ్దాల నుండి టాప్ 1 స్థానం లో కొనసాగుతున్నది ఎవరు అంటే, మన అందరికీ గుర్తుకు వచ్చే ఏకైక పేరు సుమ(Suma Kanakala) మాత్రమే. టెలివిజన్ రంగం లో ఎంతమంది కొత్త యాంకర్లు పుట్టుకొచ్చినా, సుమ స్థానాన్ని ఎవ్వరూ రీ ప్లేస్ చేయలేకపోతున్నారు. నేటి తగరం ఆడియన్స్ కి తగ్గట్టుగా తనని తానూ అప్డేట్ చేసుకొని ముందుకు వెళ్తుండడం వల్లే ఆమెకు ఈ రేంజ్ డిమాండ్ ఉందని అంటుంటారు. కేవలం బుల్లితెర లో మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కూడా యాంకర్ సుమ ఉండాల్సిందే. స్టార్ హీరో సినిమాకి అయినా, మీడియం రేంజ్ హీరో సినిమాకి అయినా, సుమ లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఊహించుకోవడం చాలా కష్టమే. ఆ రేంజ్ డిమాండ్ తో కొనసాగుతూ ముందుకెళ్తుంది ఆమె.
సోషల్ మీడియా లో కూడా ఈమె చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె అప్లోడ్ చేసే రీల్స్ కి మామూలు క్రేజ్ లేదు. కేవలం రీల్స్ కోసం ఆమె ప్రత్యంగ కంటెంట్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఈమె అప్లోడ్ చేసిన ఒక రీల్ బాగా వైరల్ అయ్యింది. అందులో ఆమె ఒక హోటల్ కి వెళ్లినట్టు, అక్కడ ఆమె రెండు చేపలు , రెండు రొయ్యలు తిన్నందుకు గాను ఏకంగా పాతిక లక్షల 27 వేల రూపాయిలు కట్టినట్టు చెప్పుకొచ్చింది. రెండు చేపలు, రెండు రొయ్యలకు పాతిక లక్షలా..?, అంత డబ్బులు పెట్టడానికి వాటిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అని మీరు అనుకోవచ్చు. ప్రత్యేకత చెప్పాలో లేదు, దేశం లో ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే సుమ వియాత్నం టూర్ కి వెళ్ళింది.
మన ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం మన రూపాయి విలువ 296 వియాత్నం డాలర్స్ తో సమానం. దీనిని బట్టీ మన కరెన్సీ లో అయిన బిల్లు అక్షరాలా 8300 రూపాయిలు. దీన్ని అక్కడి కరెన్సీ లెక్కల్లోకి మారిస్తే 25 లక్షల 27 వేల డాలర్లు అవుతుందని సుమ ఆ వీడియో లో వివరించింది. చివర్లో ఆమె వెయిటర్ కి టిప్పు కూడా అందించి థాంక్స్ చెప్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ అయ్యింది.
View this post on Instagram