Sree mukhi : బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూ.. అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. ఆన్ స్క్రీన్ తాను చేసే సందడే వేరుగా ఉంటుంది. తనదైన మాటలతో, పంచ్ లతో రచ్చ రచ్చ చేసేస్తుంది. అయితే.. యాంకరింగ్ తో బిజీగా ఉండే శ్రీముఖి.. సోషల్ మీడియాను మాత్రం వదిలి పెట్టదు. ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ.. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది.

బిగ్ బాస్ షో శ్రీముఖి కెరీర్ కి చాలా ఉపయోగపడిందనే చెప్పాలి. ఆ షో తరువాత శ్రీముఖికి అవకాశాలు చీలా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో.. సినిమా చాన్స్ లు కూడా వస్తున్నాయి. ఇటీవల క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా నటించిన శ్రీముఖి.. తాజాగా మ్యాస్ట్రో మూవీలో విలన్ వైఫ్ క్యారెక్టర్ చేసింది. ఆ విధంగా కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది శ్రీముఖి.
ఇక, సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ పిక్స్.. కుర్రాళ్ల పల్స్ రేట్ అమాంతం పెంచేస్తాయి. రెగ్యులర్ ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది. అయితే.. ఈ ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు.
విజయదశమి పండుగను పురస్కరించుకొని శ్రీముఖి అచ్చ తెలుగు అమ్మయిలా పద్దతిగా తయారైంది. రెడ్ చూడిదార్ ధరించి, ట్రెడిషనల్ లుక్ లో కేక పుట్టించింది. ఇప్పటి వరకూ శ్రీ ముఖి హాట్ పిక్స్ చూసిన వాళ్ళు. ట్రెడిషనల్ లుక్ చూసి వావ్ అంటున్నారు. తన కుటుంబంతో కలిసి టెంపుల్ ను దర్శించుకొని, ఫొటోలకు ఫోజిచ్చింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.