https://oktelugu.com/

Manchu Vishnu: మీడియాను అంతలా వాడుకొని ఏంటీ పని మంచు విష్ణు?

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసి తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ వర్గంతో మెగా ఫ్యామిలీని ఢీకొడుతూ విష్ణు చేసిన హంగామా అంతా ఇంతాకాదు.. విమానాల్లో మా సభ్యులను రప్పించి.. అందరినీ వెతికి మరీ ఓటు వేయించి..పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను గంప గుత్తగా తనకు అనుకూలంగా మార్చేసి.. ఎన్నికల్లో గెలుపుకోసం మీడియాను ఎంత వాడాలో అంతా వాడేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. ‘మా’ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2021 / 06:39 PM IST
    Follow us on

    Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసి తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ వర్గంతో మెగా ఫ్యామిలీని ఢీకొడుతూ విష్ణు చేసిన హంగామా అంతా ఇంతాకాదు.. విమానాల్లో మా సభ్యులను రప్పించి.. అందరినీ వెతికి మరీ ఓటు వేయించి..పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను గంప గుత్తగా తనకు అనుకూలంగా మార్చేసి.. ఎన్నికల్లో గెలుపుకోసం మీడియాను ఎంత వాడాలో అంతా వాడేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు.

    Manchu Vishnu

    ‘మా’ ఎన్నికల్లో గెలిచాక ప్రకాష్ రాజ్ వర్గం ఆగ్రహంతో.. అవమానంతో రగిలిపోతోంది. కోర్టుకు ఎక్కేందుకు రెడీ అవుతోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. సీసీ టీవీ ఫుటేజ్ చూపించాలని ఇప్పటికే ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే మోహన్ బాబు, నరేశ్ లు చేసిన దాడులు, గొడవలను బయటపెట్టారు.

    ఇంత జరుగుతున్నా మంచు విష్ణు మాత్రం స్పందించలేదు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామాలపై మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి కారణాలు వారికున్నాయని.. కానీ అభివృద్ధి కోసం ప్రత్యర్థి ప్యానల్ సభ్యులను కలుపుకొని పోతానని మంచు విష్ణు చెబుతున్నాడు. కానీ ఈయనతో కలవడానికే ప్రకాష్ రాజ్ వర్గం అస్సలు మొగ్గు చూపడం లేదు.

    ఇక మంచు విష్ణు ఎన్నికల్లో గెలుపు కోసం మీడియాను, సోషల్ మీడియాను ఎంతలా వాడారో అందరం చూశాం. ఇప్పుడు మా ఎన్నికలు ముగిశాక అదే మీడియా మంచు విష్ణుకు శరాఘాతంగా మారింది. అతడిని ఇబ్బంది పెట్టేలా ప్రశ్నిస్తోంది.కానీ విష్ణు మాత్రం స్పందించడం లేదు. అందుకే ఇక తాను, తన టీం సభ్యులు మీడియాకు దూరంగా ఉంటామని ప్రకటించడం కొసమెరుపు.

    వాడేంతగా వాడేసి ఇప్పుడు దూరం అంటే ఎట్లా అని మీడియా మిత్రులు మంచు విష్ణు పై కారాలు మిరియాలు నూరుతున్నారట.. మమ్మల్ని వాడుకొని వదిలేస్తావా? మాకు మసాలా న్యూస్ ఇవ్వవా అంటూ దెప్పి పొడుస్తున్నారట.. మంచు విష్ణు మీడియాకు దూరం అని చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.