Siliguri Corridor India Key Project: కేంద్రం కొన్ని నెలలుగా ఈశాన్య భారత్‌వైపు సైన్యాన్ని తరలిస్తోంది. ఇంతకాలం ఈశాన్య భారతానికి ఎలాంటి ముప్పు ఉండేది కాదు. కానీ బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలు, చైనాతో చేతులు కలిపి చేస్తున్న కుట్రలతో భారత్ అప్రమత్తమైంది. ఈ క్రమంలో ఈశాన్య భారతంలో రోడ్డు మార్గాలు, ఎయిర్‌బేస్‌లు నిర్మిస్తోంది. తాజాగా కేంద్రం పశ్చిమ బెంగాల్‌లోని తీన్‌మిల్‌హాట్ నుంచి రంగాపాణి వరకు 40 కిలోమీటర్ల డబుల్ ట్రాక్ రైల్వే మార్గాన్ని నేలకు 20 మీటర్ల లోతులో నిర్మించాలని నిర్ణయించింది. ఏడు ఈశాన్య రాష్ట్రాల 2.80 లక్షల చదరపు కి.మీ. భూభాగాన్ని కవర్ చేసే సిలిగుడి కారిడార్ సమీపంలో దీనిని నిర్మించనుంది. ఈమేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.
చికెన్ నెక్ భద్రతా సవాల్..
సిలిగుడి కారిడార్ ఈశాన్య భారతానికి ఏకైక లింక్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్‌తో సరిహద్దులు కలిగి ఉంది. బంగ్లాదేశ్ బెదిరింపులు, చైనా లాంగోడి ఎయిర్‌బేస్, పంచగడ్ బేస్(డోక్లాం సమీపంలో) వంటి సంక్షోభాల నేపథ్యంలో భద్రతా అవసరం. మెత్తని నేల, జనాభా భారం ఉన్న ప్రాంతంలో భూమి మీద ట్రాక్ కష్టం కావడంతో అండర్‌గ్రౌండ్ రైలు మార్గాన్ని ఎంపిక చేసింది.
డ్రోన్–మిసైల్ రక్షణ..
అత్యాధునిక సాంకేతికతలతో నిర్మాణం, ఒక్క రైలులో 300 ట్రూక్‌ల సరుకు తీసుకెళ్లవచ్చు. డ్రోన్, మిసైల్ దాడుల నుంచి సరుకు–సిబ్బంది రవాణా కాపాడుతుంది. చోప్రా, కిషన్‌గంజ్, లాజిక్ బప్ఫూర్ వంటి ప్రాంతాల్లో ఇది ముఖ్యం. గతంలో ఇక్కడ అగ్ని మిసైల్ ప్రయోగం విజయవంతమైంది.
ఈ ప్రాజెక్టు సిలిగుడి రక్షణను బలోపేతం చేస్తుంది, యుద్ధ సమయంలో రవాణా అవరుద్ధి నివారిస్తుంది. భౌగోళిక సవాలులను అధిగమించి భారత రక్షణ వ్యవస్థను మరింత గట్టిగా చేస్తుంది. పొరుగు బెదిరింపుల మధ్య ఈశాన్య భారతాన్ని మరింత సురక్షితం చేసే కీలక చర్య.