Anchor Shyamala Banned From Tollywood
Top Anchor: రాజకీయాల్లో తలదూర్చి కెరీర్ నాశనం చేసుకుంది ఓ స్టార్ యాంకర్. పరిశ్రమ ఆమెను పక్కన పెట్టేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు యాంకర్ శ్యామల. టాలీవుడ్ స్టార్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. అటు యాంకర్ గా ఇటు నటిగా రాణిస్తుంది. గత ఏడాది విరూపాక్ష అనే సూపర్ హిట్ మూవీలో ఆమె కీలక రోల్ చేశారు. కాగా 2024 ఎన్నికలకు ముందు శ్యామల వైసీపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేసింది.
పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో సైతం శ్యామల ప్రచారం చేసింది. కాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై పరోక్ష విమర్శలు చేసింది. ఆయన మీద ఆమె ఓ కథ చెప్పారు. శ్యామల కామెంట్స్ ని పరిశ్రమకు చెందిన పలువురు ఖండించారు. కాగా ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమి చవిచూశాడు. దాంతో శ్యామలకు గడ్డుకాలం మొదలైంది. శ్యామలకు సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువయ్యాయి. కొందరు బెదిరిస్తున్నారని శ్యామల ఆవేదన చెందారు.
కాగా టాలీవుడ్ అంటే నందమూరి, కొణిదెల కుటుంబాల హవా నడుస్తుంది. ముఖ్యంగా అరడజనుకు పైగా మెగా హీరోలు ఉన్నారు. అలాగే వారిని అభిమానించే సాంకేతిక నిపుణులు , నిర్మాతలు ఉన్నారు. బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎన్డీయేలో భాగస్వాములు. ఈ క్రమంలో శ్యామలను పక్కన పెట్టేశారట. టీడీపీ, జనసేనను అభిమానించే ఇండస్ట్రీ ప్రముఖులు శ్యామలకు అవకాశాలు ఇవ్వడం లేదట.
Also Read: Celebrities Costumes: సినిమాలు, సీరియల్ లో వాడిన కాస్ట్యూమ్స్ ఏం చేస్తారు
దీంతో శ్యామలకు ఈవెంట్స్ రావడం లేదట. ఇక నటిగా అవకాశాలు కూడా కనుమరుగు అయ్యాయట. మొత్తంగా శ్యామల రెండిటికీ చెడ్డ రేవడిలా తయారైందనే టాక్ వినిపిస్తుంది. మరి ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ శ్యామల కెరీర్ ప్రమాదంలో పడింది అంటున్నారు. వైసీపీ పార్టీకి అనుకూలురైన వారికి పరిశ్రమలో ఆఫర్స్ రావడం లేదు. ఇప్పటికే పోసాని కృష్ణమురళిని పరిశ్రమ దూరం పెట్టింది.