Sleeping Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా పడుకోవాలి

రాత్రి సమయంలో తిన్న తర్వాత కాసేపు కచ్చితంగా నడవాలి. కానీ కొందరు వెంటనే బెడ్ ఎక్కుతారు. మధ్యాహ్నం కూడా తిని పడుకుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. తెలిసో తెలియకో మీ శరీరాన్ని మీరు అనారోగ్య పాలు చేసిన వారు అవుతారు.

Written By: Swathi Chilukuri, Updated On : June 26, 2024 11:37 am

Sleeping Tips

Follow us on

Sleeping Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రస్తుతం చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. ఎన్నో ప్రయత్నాలు చేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నమాదిరి రోజులు ఉండటం లేదు. ఆరోగ్యం కోసం వ్యాయామాలు, కసరత్తులు, మంచి ఆహారం ఇలా చెప్పుకుంటే పోతే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. నిద్ర కూడా చాలా అవసరం. కానీ ఈ నిద్రించే సమయంలో ఏ వైపు పడుకుంటున్నారా? ఎలా పడుకుంటున్నారు అనేది కూడా ముఖ్యమే.

రాత్రి సమయంలో తిన్న తర్వాత కాసేపు కచ్చితంగా నడవాలి. కానీ కొందరు వెంటనే బెడ్ ఎక్కుతారు. మధ్యాహ్నం కూడా తిని పడుకుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. తెలిసో తెలియకో మీ శరీరాన్ని మీరు అనారోగ్య పాలు చేసిన వారు అవుతారు. అయితే పడుకునే ముందు ఒక అరగంట సేపు అయినా వెళ్లకిల అంటే నిటారుగా పడుకోవాలి. ఒక అరగంట ఇలా పడుకోవడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి సహాయం అవుతుంది.

ఇక అరగంట తర్వాత ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి. మీరు ఇలా పడుకున్నప్పుడు నిద్ర పోయినా అనుకోకుండా కొన్ని సార్లు కుడి వైపు తిరుగుతారు. దీని వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ ముందు మాత్రం స్టేట్ గా పడుకొని ఆ తర్వాత ఎడమ వైపుకు తిరిగి పడుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.

ఎడమ వైపు ఎందుకు పడుకోవాలి?
మీరు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల అన్నం జటరాగ్ని దగ్గరకు వెళ్తుందట. దీని వల్ల ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. అన్నం సరిగ్గా జీర్ణం అవకముందే పడుకోవడం అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే అరగంట వెల్లకిలా ఆ తర్వాత ఎడమ వైపు తర్వాత కుడివైపు పడుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.