https://oktelugu.com/

Anchor Rashmi : సనాతన ధర్మం అంటూ ఈ పనులేంటి? రష్మీకి సూటి ప్రశ్న, షాకింగ్ ఆన్సర్ ఇదే!

రష్మీ గౌతమ్ ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా రష్మీ గౌతమ్ వేగన్, యానిమల్ లవర్. మూగజీవాల కోసం సోషల్ మీడియాలో పోరాటం చేస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 12, 2023 / 08:43 PM IST
    Follow us on

    Anchor Rashmi : రెండు రోజులగా రష్మీ గౌతమ్ సనాతన ధర్మానికి మద్దతుగా వరుస ట్వీట్స్ వేస్తున్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్లకు సమాధానం చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. హీరో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని దోమతో పోల్చాడు. ఎలాగైతే దోమలు మలేరియా, డెంగ్యూ వ్యాప్తి చేస్తాయో సనాతన ధర్మం కూడా సమాజానికి హానికరం అన్నాడు. దోమల వలె సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని బల్లగుద్దారు. ఈ కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. హిందూ వర్గాలు స్టాలిన్ కామెంట్స్ ని తీవ్రంగా తప్పుబట్టాయి.

    ప్రకాష్ రాజ్, సత్యరాజ్ తో పాటు కొందరు కోలీవుడ్ నటులు ఉదయనిధి స్టాలిన్ కి మద్దతు తెలిపారు. రామ్ చరణ్ తో పాటు కొందరు వ్యతిరేకించారు. యాంకర్ రష్మీ గౌతమ్ సైతం సనాతన ధర్మానికి మద్దతుగా నిలిచారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయం తెలియజేసింది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవారు రష్మీ గౌతమ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సదరు ప్రశ్నలకు రష్మీ ఓపిగ్గా సమాధానాలు చెబుతుంది.

    ఓ నెటిజన్ రష్మీ గౌతమ్ హాట్ ఫోటో షేర్ చేశాడు. అలాగే సనాతన ధర్మలో దీనికి స్థానం ఉందా? ఇలా చేయవచ్చా? అని ప్రశ్నించాడు. దీనికి రష్మీ స్పందించింది. వాదన గెలవలేనివారు ఇలాంటి చెత్త ప్రశ్నలు వేస్తారని ఆమె ట్వీట్ చేశారు. నిర్మాణాత్మకంగా ఒక విషయం మీద అర్గ్యూ చేయాలి. పాయింట్ లేక ఇలాంటి విషయాలు తెరపైకి తెస్తున్నారని ఆమె పరోక్షంగా అభిప్రాయ పడ్డారు.

    రష్మీ గౌతమ్ ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా రష్మీ గౌతమ్ వేగన్, యానిమల్ లవర్. మూగజీవాల కోసం సోషల్ మీడియాలో పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మరణించాడు. అప్పుడు రష్మీ గౌతమ్ పై నెటిజెన్స్ మండిపడ్డారు. అయినా వీధి కుక్కలనే ఆమె సప్పోర్ట్ చేశారు. ప్రస్తుతం రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు చేస్తున్నారు. వెండితెరమీద ఆమెకు ఆఫర్స్ తగ్గాయి.