https://oktelugu.com/

Undavalli Arun Kumar : అక్టోబర్ 31 లోగా కీలక అరెస్టులు.. ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

రామోజీరావు అయినా ఉండాలి అన్న అనుమానం కలుగుతోంది. ఈ తరుణంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Written By:
  • NARESH
  • , Updated On : September 12, 2023 / 08:37 PM IST

    undavalli-arun-kumar-

    Follow us on

    Undavalli Arun Kumar : ఏపీలో మున్ముందు కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? చంద్రబాబుకు మించి అరెస్టులు జరగనున్నాయా? ఈ సరికొత్త అరెస్ట్ నారా లోకేష్ దా? లేకుంటే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నదా? లేకుంటే ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు దా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానాలు నిజమే అనిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.దీనిపై సంఘీభావం వ్యక్తం చేస్తూనే.. ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ఏపీ సిఐడి చీఫ్ ఇప్పటికే చాలా విషయాల్లో స్పష్టతనిచ్చారు. నెక్స్ట్ వికెట్ అచ్చం నాయుడుతోపాటు లోకేష్ దేనని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ అమలు సమయంలో కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్న ఉన్నారు. అటు మానవ వనరుల శాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు నాయకుల పేర్లు తాజాగా బయటకు వస్తున్నాయి. తదుపరి టార్గెట్ ఈ ముగ్గురే అని తేలుతోంది. ఇటువంటి తరుణంలో ఉండవల్లి అరుణ్ కుమార్కీలక అరెస్టులు ఉంటాయని చెప్పడం విశేషం.

    మరోవైపు ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు పేరు సైతం వినిపిస్తోంది. ఇప్పటికే మార్గదర్శి కేసులో రామోజీరావు చుట్టూ వైసీపీ సర్కార్ ఉచ్చు బిగిస్తోంది. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా రామోజీరావును దెబ్బ కొట్టాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే విషయం. ఇదే వేడిలో రామోజీరావును అరెస్టు చేస్తే రాజకీయంగా పై చేయి సాధించవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రామోజీరావు అరెస్టుకు ఉన్న సాధ్యసాద్యాలను జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆది నుంచి రామోజీరావు కేసు విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గట్టిగానే పోరాడుతున్నారు. ఈ తరుణంలో అదే ఉండవల్లి అక్టోబర్ 31 లోగా కీలక అరెస్టులు ఉంటాయని చెప్పడం విశేషం. అది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ ముగ్గురైనా ఉండాలి. లేకుంటే రామోజీరావు అయినా ఉండాలి అన్న అనుమానం కలుగుతోంది. ఈ తరుణంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.