Anchor Rashmi Review: కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హీరోగా 777 చార్లీ విడుదల కాగా యాంకర్ రష్మీ ఓ షార్ట్ రివ్యూ ఇచ్చారు. ప్రత్యేకంగా ఈ మూవీకి ఆమె రివ్యూ ఇవ్వడం వెనుక ఓ కారణం ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. ముఖ్యంగా ఆమె కుక్కల పట్ల ప్రేమ, దయ కలిగి ఉన్నారు. ఖాళీ సమయం దొరికితే రష్మీ వీధి కుక్కలకు ఆహారం పెడతారు. తన కారులో ఆహారం తీసుకెళ్లి కుక్కల ఆకలి తీర్చుతారు. అలాగే దేశంలో ఎవరు, ఎక్కడ మూగజీవాలకు హాని తలపెట్టినట్లు తెలిసినా స్పందిస్తారు. వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తులు పంపుతారు. ఇప్పటికే పలు మార్లు ఇలాంటి సంఘటనలపై రష్మీ స్పందించారు.

Also Read: AP Political Parties: జనాల్లోకి ఏపీ రాజకీయ పార్టీలు.. ప్లాన్ఏంటి?
ఈ క్రమంలో 777 చార్లీ మూవీ ఓ కుక్క ప్రధానంగా తెరకెక్కింది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన ఈ మూవీలో కుక్క కీలక రోల్ చేసింది. ఓ మనిషి జీవితాన్ని మూగ జీవి కుక్క ఎలా మార్చింది అనేది ఈ చిత్ర కథ. అందుకే రష్మీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూశారు. అలాగే అందరూ 777 చార్లీ చిత్రాన్ని చూడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు పెట్ లవర్ అయినా కాకపోయినా ఈ 777 చార్లీ మీకు కచ్చితంగా నచ్చుతుంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకునే సినిమా ఇది అంటూ ఛార్మి పోస్ట్ పెట్టింది. ఇందులో చార్లీ డాగ్ చూపిన పర్‌ఫార్‌మెన్స్ అద్భుతం అంటూ కొనియాడింది రష్మీ. ప్రతి సన్నివేశం కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిందని రష్మీ కామెంట్ చేశారు.

777 చార్లీ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఓ పెట్ లవర్ గా, మూగ జీవుల ప్రేమికురాలిగా చార్లీ చిత్రాన్ని రష్మీ గౌతమ్ ప్రమోట్ చేశారు. రష్మీ ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్నారు. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చాయి. రష్మీ హీరోయిన్ గా నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. యాంకర్ గా మాత్రం కెరీర్ జోష్ లో ఉంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో రష్మీ యాంకర్ గా చేస్తున్నారు.
[…] […]