Homeఎంటర్టైన్మెంట్Nayanthara Couples In Tirumala: తిరుమలలో నయనతార దంపతుల అపచారం.. కొత్తగా పెళ్లై ఇలా చేస్తారా?

Nayanthara Couples In Tirumala: తిరుమలలో నయనతార దంపతుల అపచారం.. కొత్తగా పెళ్లై ఇలా చేస్తారా?

Nayanthara Couples In Tirumala: సినీనటి నయనతార ఎప్పుడు వార్తల్లో ఉంటారు. ఏం చేసినా అది వివాదాస్పదమే కావడం తెలిసిందే. తాజాగా ఆమె దర్శకుడు విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. మహాబలిపురంలో పెళ్లి చేసుకున్న జంట తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. దీంతో ఆమె మరో వివాదంలో దూరారు. తిరుమల మాడ వీధుల్లో పాదరక్షలు వేసుకుని తిరిగి అందరి చేత విమర్శలు ఎదుర్కొంది. విఘ్నేష్ చెప్పులు వేసుకోకపోయినా నయనతార మాత్రం చెప్పులతో తిరగడం సంచలనం సృష్టించింది. దీంతో భక్తులు మండిపడుతున్నారు. ఆలయ నిబంధనలు పట్టించుకోరా? ఆమె సెలబ్రిటీ అయినంత మాత్రాన చెప్పులు వేసుకుని తిరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను చూసి మీడియా సిబ్బంది కూడా అలాగే చేయడంపై పెద్ద దుమారమే రేగుతోంది.

Nayanthara Couples In Tirumala
Nayanthara, Vignesh

నయనతార గతంలోనే డ్యాన్సర్, దర్శకుడు ప్రభుదేవాను ప్రేమించి పెళ్లి వరకు వెళ్లి తరువాత రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇంకా కథానాయకుడు శింబుతో కూడా కొద్ది రోజులు తిరిగినట్లు తెలుస్తోంది. చివరకు దర్శకుడు విఘ్నేష్ తో పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ప్రారంభించాలని భావించింది. తిరుమలలోనే వివాహం చేసుకోవలని అనుకున్నా అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో చేసుకోవాల్సి వచ్చింది. కానీ వివాహం తరువాత శ్రీవారిని దర్శించుకున్న ఆమె వివాదంలో చిక్కుకోవడం తెలిసిందే.

Also Read: Pavan Kalyan Break For Movies: సినిమాలకు పవన్ లాంగ్ బ్రేక్.. ఎన్నికల వరకూ ప్రజల్లోనే..

ఇంత జరుగుతున్న భద్రత సిబ్బంది ఏం చేస్తున్నట్లు? వారు విధులు నిర్వహిస్తున్నారా? వినోదాలు చూస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో కనీస పద్ధతులు పాటించకుండా విచ్చలవిడిగా చెప్పులు వేసుకుని తిరగడం సంచలనం సృష్టిస్తోంది. దైవ సన్నిధిలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన నయనతారపై చర్యలు తీసుకోరా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకో న్యాయం? సెలబ్రిటీలకు మరో న్యాయమా? అనే అనుమానాలు వస్తున్నాయి.

Nayanthara Couples In Tirumala
Natan, vignesh

శ్రీవారి ఊరేగింపు మాడవీధుల్లోనే నిర్వహిస్తారు. దీంతో అక్కడ భక్తులైనా, వీఐపీలైనా చెప్పులు విప్పి తిరగాలి. కానీ నయనతార ఇవేమీ పట్టించుకోకుండా పాదరక్షలతో తిరగడం ఆందోళన కలిగించింది. ఆమె చెప్పులు వేసుకోవడంతో మీడియా సిబ్బంది కూడా అదే బాటలో నడిచి బూట్లు వేసుకుని తిరగడం వివాదాస్పదమైంది దీంతో నయనతారకు దేవుడిపై నమ్మకం ఉందా? లేకపోతే ఎందుకు గుడికి రావడం? అలా ఎందుకు చేయడం? అని భక్తుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై ఆమె ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే మరి.

Also Read: Stubborn To Sachivalayam Employees: సచివాలయ ఉద్యోగులకు మొండిచేయి.. ఈసారి ప్రొబేషన్ డిక్లరేషన్ లేనట్టేనా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version