Anchor Rashmi Gautam marrying a american boy
Anchor Rashmi: దశాబ్దానికి పైగా స్టార్ యాంకర్ గా రాణిస్తుంది రష్మీ గౌతమ్. తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచింది. జబర్దస్త్ కామెడీ షో ఆమెకు విపరీతమైన ఫేమ్ తెచ్చిపెట్టింది. అటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటుంది. పలు చిత్రాల్లో రష్మీ గౌతమ్ హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే రష్మీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన పెళ్లి గురించి తరచుగా వార్తలు చక్కర్లు కొడుతుంటాయి.
రష్మీ పెళ్లి వార్తలు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా రష్మీ గౌతమ్ ఓ అమెరికా అబ్బాయిని పెళ్లాడబోతుందనే వాదన తెరపైకి వచ్చింది తెలుస్తుంది. ఓ జబర్దస్త్ కమెడియన్ ఈ విషయం బయట పెట్టాడు. ఫ్లో లో నోరు జారీ నిజం చెప్పేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో బుల్లెట్ భాస్కర్ ఓ స్కిట్ చేశాడు. ఇందులో రాజు గారి గెటప్ లో భాస్కర్ కనిపించాడు. ఈ క్రమంలో కొన్ని పంచులు వేస్తూ నవ్వులు పూయించాడు.
తాను తేల్చాల్సిన ఒక లెక్క ఉందంటూ .. రష్మీ దగ్గరకు వచ్చాడు. ఇక రష్మిని చూస్తూ .. మన బాబు జీతాలు బాగానే ఇస్తున్నట్టున్నాడు .. ప్రతి వీడియో క్రింద కామెంట్లు చూస్తుంటే అర్థమవుతుంది అంటూ సుడిగాలి సుధీర్ పై పంచ్ వేశాడు. దీంతో రష్మీ నవ్వుతుంది. భాస్కర్ కంటిన్యూ చేస్తూ .. వాడెవడో ఫస్ట్ కామెంట్ .. బుల్లెట్ భాస్కర్ గాడికి గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందంటూ రాసుకొచ్చాడు కామెంట్లు పెడితే బయపడటానికి నేను గోట్ కాదు లయన్ అంటూ డైలాగులు కొట్టాడు.
ఆ తర్వాత అసిస్టెంట్ వచ్చి భాస్కర్ తో .. నాకు ఒక డవుటయ్యా… సుడిగాలి సుధీర్ కు, రష్మీ కి పెళ్లవుతుందా అని అడిగాడు. ఎందుకు కాదు .. నిన్నే జాతకాలు చూపించాను .. వారిద్దరికీ కచ్చితంగా పెళ్లి అవుతుంది, అన్నాడు భాస్కర్ చెబుతాడు. రష్మీ అమెరికా వాడిని చేసుకుంటుంది .. సుధీర్ అనకాపల్లి అమ్మాయిని చేసుకుంటాడని భాస్కర్ చెప్పాడు. స్కిట్ లో ఫన్ కోసం భాస్కర్ సరదాగా ఇలా పంచులు వేశాడు. జనాలు మాత్రం రష్మీ నిజంగానే అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకునే సూచనలు కలవని అంటున్నారు.
Web Title: Anchor rashmi gautam marrying a american boy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com