Anchor Manjusha: తెలుగు తెర పై బోల్డ్ యాంకర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ.. వారిలో ‘యాంకర్ మంజూష’ శైలి వేరు. పోటీగా ఎంతమంది భామలు ఉన్నా.. కొత్తగా వస్తున్నా.. మంజూష రాగం.. తాళం వేరు. తాజాగా యాంకర్ మంజూష మెరూన్ కలర్ శారీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాకే హీట్ పెంచింది.
‘మంజూష’ ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘మంజూష గారు మెరూన్ కలర్ శారీలో మీరు మరోసారి అదరగొట్టారు అండి. అసలు ఇంత అందం పెట్టుకుని ఎందుకు స్టార్ హీరోయిన్ కాలేదు ?’ అంటూ నెటిజన్లు ఆమెకు మెసేజ్ లు చేస్తున్నారు. సహజంగానే మంజూష ఎంతో అందంగా, ఆకర్షవంతంగా ఉంటుంది. కానీ, పై శారీలో మాత్రం ఆమె అందం రెట్టింపు అయ్యింది.
Also Read: Anasuya: లంగా ఓణీలో ‘అనసూయ’ కసి చూపులు.. సిగ్గు మొగ్గలేసిన ఫోజులు !
అందుకే, మంజూష ఒక్క ఫోటో షూట్ చేస్తే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అసలు మంజూష అలా హస్కీ లుక్స్ లో కైపుగా చూస్తే.. హీరోయిన్లు కూడా దిగదుడుపే. నిజానికి ఆమె మొదట్లో హీరోయిన్ అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చింది.
పై ఫోటో చూస్తే.. మంజూష అందం ముందు ఏ హీరోయిన్ అయినా తక్కువే అనిపిస్తోంది కదూ. మరి ఇంత అందం పెట్టుకుని కూడా మంజూష మాత్రం హీరోయిన్ గా మారలేకపోయింది. ఎన్టీఆర్ ‘రాఖీ’ సినిమాలో ఆయన చెల్లెలుగా యాంకర్ మంజూష నటించింది.
ఎన్టీఆర్ ‘రాఖీ’ సినిమాలో మంజూష నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఆ సినిమా తర్వాత ఎందుకో ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రేక్షకులను తన నటనతో బాగా అలరించిన తనకు ఛాన్స్ లు రాకపోయే సరికి.. మంజూష ఆ తర్వాత నటన పై ఆసక్తిని చంపుకుంది.
ప్రస్తుతం మంజూష యాంకర్ గా ఫుల్ బిజీగా ఉంది. ఆమె గ్లామర్ కోసమే నెటిజన్లు ఆమె వీడియోలను తెగ చూస్తారు. ఇక మంజూష కూడా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది.
యాంకర్ గానే కాకుండా.. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలతో పాటు వివిధ సందర్భాల్లో దిగిన ఫోటోలను కూడా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పంచుకుంటూ తన ఫాలోవర్స్ కి మంజూష ఫుల్ కిక్ ను ఇస్తూనే ఉంది.
ఇకనైనా మంజూష యాంకర్ గానే కాకుండా.. భవిష్యత్తులో హీరోయిన్ గా కూడా రాణించాలని ఆశిద్దాం. ఆమెకు ఆ స్థాయి ఉంది అని అందరూ నమ్ముతున్నారు.
Also Read:Chiranjeevi: షాకింగ్ : ఆ 20 కోట్లు తిరిగి ఇచ్చేసిన చిరంజీవి