Anasuya: యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం

Anasuya: బుల్లితెర యాంకర్​ అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్​ రావు కన్నుమూశారు. తార్నాకలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుదర్శన్​ రావు చాలాకాలంగా కాంగ్రెస్​ పార్టీలో పనిచేశారు. అనసూయ ఎప్పుడూ తన తండ్రి గురించి మాట్లాడిన ప్రతిసారీ.. ఎంతో ప్రేమగా చెప్తుండేది. కాగా, ప్రస్తుతం అనసూయ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి సానుభూతి తెలిపారు. అనసూయ తండ్రి పేరు సుదర్శన్​.. ఆయనొక వ్యాపార వేత్త.. […]

Written By: Raghava Rao Gara, Updated On : December 5, 2021 11:48 am
Follow us on

Anasuya: బుల్లితెర యాంకర్​ అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్​ రావు కన్నుమూశారు. తార్నాకలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుదర్శన్​ రావు చాలాకాలంగా కాంగ్రెస్​ పార్టీలో పనిచేశారు. అనసూయ ఎప్పుడూ తన తండ్రి గురించి మాట్లాడిన ప్రతిసారీ.. ఎంతో ప్రేమగా చెప్తుండేది. కాగా, ప్రస్తుతం అనసూయ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి సానుభూతి తెలిపారు.

అనసూయ తండ్రి పేరు సుదర్శన్​.. ఆయనొక వ్యాపార వేత్త.. ఆయన తల్లి పేరునే అనసూయకు పెట్టుకున్నారు. అనసూయను ఆర్మీకి పంపించాలని ఆయన కల.కానీ, ఆనసూయ మాత్రం సినిమా ఇండస్ట్రీపై ఉన్న మక్కువతో ఈ వైపు స్టెప్​ తీసుకుంది. అయితే, అనసూయ లవ్​ మ్యారేజ్​ చేసుకోవడంతో.. ఆమెను ఇంట్లో నుంచి వెల్లగొట్టేశారని ఒకానొక ఇంటర్వ్యూలో అనసూయ స్వయంగా చెప్పింది.

కెరీర్​ మొదట్లో అనసూయ ఓ న్యూస్​ ఛానల్​లో న్యూస్​ రీడర్​గా పని చేసింది. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు దక్కించుకుని యాంకర్​గా మారింది. ప్రస్తుతం ఆమె వాక్​చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత తన నటనతోనూ అందర్నీ మెప్పించింది. ప్రస్తుతం ఓ వైపు జబర్దస్ట్ యాంకర్​గా చేస్తూనే.. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. ఇటీవలే రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అందర్నీ అలరించిన ఈ భామ.. ఇప్పుడు పుష్ప సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించేందుకు సిద్ధమైంది. మరి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.