HBD Payal Rajput: బోల్డ్ బ్యూటీ పాయల్ ఛాన్సుల కోసం అలా చేసిందా?

HBD Payal Rajput: పాయల్ రాజ్ పుత్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ‘ఆర్ఎక్స్ 100’ మూవీనే గుర్తుకొస్తుంది. ఈ మూవీ టాలీవుడ్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తొలి మూవీతోనే పాయల్ రాజ్ పుత్ సినీప్రియులకు అదిరిపోయే గిప్ట్ ను ఇచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ మూవీలో పాయల్ రాజ్ పుత్ నటన, బోల్డ్ నెస్ కు కుర్రకారు మొత్తం ఫిదా అయిపోయింది. థియేటర్లకు యువత క్యూ కట్టడంతో పాయల్ రాజ్ పుత్ తొలి మూవీనే […]

Written By: NARESH, Updated On : December 5, 2021 12:01 pm
Follow us on

HBD Payal Rajput: పాయల్ రాజ్ పుత్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ‘ఆర్ఎక్స్ 100’ మూవీనే గుర్తుకొస్తుంది. ఈ మూవీ టాలీవుడ్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తొలి మూవీతోనే పాయల్ రాజ్ పుత్ సినీప్రియులకు అదిరిపోయే గిప్ట్ ను ఇచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ మూవీలో పాయల్ రాజ్ పుత్ నటన, బోల్డ్ నెస్ కు కుర్రకారు మొత్తం ఫిదా అయిపోయింది. థియేటర్లకు యువత క్యూ కట్టడంతో పాయల్ రాజ్ పుత్ తొలి మూవీనే ‘అఖండ’ విజయం సాధించింది.

HBD Payal Rajput

డిసెంబర్ 5న పాయల్ రాజ్ ఫుత్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె సినీ జర్నీని ఓసారి గుర్తుచేసుకునే ప్రయత్నం చేద్దాం. సౌత్ ఇండియాలో ప్రస్తుతం ఉన్న పది టాప్ హీరోయిన్ల లిస్టును పరిశీలిస్తే ఇందులో పాయల్ రాజ్ పుత్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇది తనకు గర్వకారణమని పాయల్ రాజ్ పుత్ సైతం ఎన్నో సందర్భాల్లో చెప్పింది. అయితే ఆమె సినీ జర్నీ మాత్రం అంతాఈజీగా ప్రారంభం కాలేదని తెలుస్తోంది.

సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక్క ఛాన్స్ దక్కించుకునేందుకు ఆమె ముంబైలో తిరగని ఆఫీస్ లేదు. దాదాపు ఆరేళ్లపాటు ముంబై విధుల్లో తిరిగానని.. ఆ సమయంలో తనకు చుక్కలు కన్పించాయంటూ ఓ ఈవెంట్లో ఆమె చెప్పింది. ఏ దర్శకుడు తనకు అప్పుడు ఛాన్స్ ఇవ్వలేదని వాపోయింది.

సౌత్ ఇండియాలో ఆడిషన్ కు వచ్చినపుడు సైతం నువ్వు హీరోయిన్ గా ఫిట్ కావనే వారని తెలిపింది. ఈ మాటలు విన్నప్పుడు కొంత డిప్రెషన్ కు గురయ్యే దానినంటూ వాపోయింది. ఆ సమయంలోనే తెలుగులో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ మూవీ తనను ఓవర్ నైట్ స్టార్ చేసిందంటూ సంతోషం వ్యక్తం చేసింది పాయల్ రాజ్ పుత్.

Also Read: ‘మనీ హెయిస్ట్’​పై రాశీఖన్నా ఎగ్జైటింగ్​ పోస్ట్​
ఈ సినిమాలో పాయల్ గ్లామర్ కు యూత్ ఫిదా అయిపోయి ఆమె అభిమానులుగా మారిపోయారు. ఈ మూవీ తర్వాత టాలీవుడ్లో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చారు. విక్టరీ వెంకటేష్ తో ‘వెంకీమామ’, రవితేజ తో కలిసి ‘డిస్కోరాజా’ చేసింది. ఈ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో మరోసారి అందాల అరబోతతో ఆర్డీఎక్స్ మూవీ చేసింది. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు.

అయినప్పటికీ పాయల్ రాజ్ పుత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలాగే వెబ్ సీరిసుల్లోనూ పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. మరోవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ పాయల్ రాజ్ పుత్ బీజీ బీజీగా గడుపుతోంది. టాలీవుడ్లో బోల్డ్ బ్యూటిగా పేరుతెచ్చుకున్న పాయల్ సినీ కెరీర్ మరింత స్పెషల్ గా కొనసాగిపోవాలని  ‘ఓకే తెలుగు’ టీమ్ తరుపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ ఏగైన్  ‘హ్యాపీ బర్త్ డే పాయల్ రాజ్ పుత్’.

Also Read: యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం