https://oktelugu.com/

Woman Married: వామ్మో.. ఆ ప‌ని కోసం 11 పెళ్లిళ్లు చేసుకున్న మ‌హిళ‌.. ఇదేం వ్య‌స‌నం రా బాబు

Woman Married: జనరల్‌గా ప్రతీ ఒక్కరికి ఏదో ఒక వ్యసనం ఉండే ఉంటుంది. మద్యపానమో, ధూమపానమో లేదా ఇంకా వేరే ఇతర విషయాల్లో ఉన్న అలవాట్లు కాస్తా వ్యసనంగా మారి ఉంటాయి. అయితే, ఇలా వ్యసనాలు కొన్ని విషయాల పట్ల ఉండటం కామనే. కానీ, మ్యారేజ్ అనేది ఓ వ్యసనం అయితే, ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఆశ్చర్యమేస్తుంది కదూ.. పెళ్లి చేసుకోవడం ఓ వ్యసనంగా మారడం అనేది అస్సలు ఉండకపోవచ్చు అని కూడా మీరు భావించొచ్చు. కానీ, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 5, 2021 / 11:53 AM IST
    Follow us on

    Woman Married: జనరల్‌గా ప్రతీ ఒక్కరికి ఏదో ఒక వ్యసనం ఉండే ఉంటుంది. మద్యపానమో, ధూమపానమో లేదా ఇంకా వేరే ఇతర విషయాల్లో ఉన్న అలవాట్లు కాస్తా వ్యసనంగా మారి ఉంటాయి. అయితే, ఇలా వ్యసనాలు కొన్ని విషయాల పట్ల ఉండటం కామనే. కానీ, మ్యారేజ్ అనేది ఓ వ్యసనం అయితే, ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఆశ్చర్యమేస్తుంది కదూ.. పెళ్లి చేసుకోవడం ఓ వ్యసనంగా మారడం అనేది అస్సలు ఉండకపోవచ్చు అని కూడా మీరు భావించొచ్చు. కానీ, శృంగారం కోసం మ్యారేజ్ చేసుకోవడం అనేది ఓ మహిళకు వ్యసనంగా మారింది. ఆమె ఎవరు..అసలు ఆమె కథేంటి..అనే విషయాలపై ఇంట్రెస్టింగ్ స్టోరి.

    Woman Married

    పెళ్లి అనేది భారతీయ సమాజంలో అత్యంత కీలక ఘట్టం. భారతీయ వివాహ వ్యవస్థను గురించి ప్రపంచ దేశాలు సైతం చర్చించుకుంటాయి. అయితే, ఇండియాలో ఉన్న మాదిరిగా మ్యారేజ్ సిస్టమ్ వేరే కంట్రీస్‌లో అయితే ఉండబోదు. ఈ సంగతి అలా ఉంచితే.. మ్యారేజ్ అనే విషయం వ్యసనంగా మార్చుకున్న ఓ మహిళ.. శృంగారం కోసం ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకుంది. ఇకపోతే తాను త్వరలో 12వ మ్యారేజ్‌కు కూడా రెడీ అని చెప్తోంది.

    అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓ టీవీ చానల్ ‘అడిక్టెడ్ టు మ్యారేజ్’ అనే ఓ షో నిర్వహిస్తోంది.

    ఇందులో మ్యారేజ్‌కు బానిస అయిన వారు ఎవరున్నారు అనే కంటెస్ట్ కండక్ట్ చేశారు. కాగా, ఈ షోకు అమెరికాకు చెందిన మోనెట్ డయాస్ అనే 25 ఏళ్ల మహిళ హాజరైంది. తనకు మ్యారేజ్ అడిక్షన్ ఉందని పేర్కొంది. అయితే, ఇతరులతో పోల్చితే తనకు మ్యారేజ్ అడిక్షన్ చాలా ఎక్కువని, అందులో భాగంగానే తాను 11 పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

    Also Read: పొరపాటున కూడా ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోకండి.. ఏవంటే?

    తాను రెండేళ్లప్పుడే ఓ అబ్బాయిని ఇష్టపడ్డానని, ఇక ఇరవై ఏళ్లు వచ్చేసరికి తనకు దాదాపు 30 మంది లవ్ ప్రపోజ్ చేశారని వివరించింది. అయితే, తాను ఇప్పటి వరకు 11 మందిని పెళ్లి చేసుకున్నానని, ఒకరికి డైవోర్స్ ఇచ్చిన తర్వాత మరొకరిని అలా అంతమందిని మ్యారేజ్ చేసుకున్నానని మోనెట్ డయాస్ చెప్పుకొచ్చింది. మొత్తంగా తాను బట్టలు మార్చుకున్న మాదిరిగానే భర్తలనూ మార్చుకుందని పలువురు ఈ విషయం తెలుసుకుని అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఈ 11 మంది కాకుండా తాను చాలా మందితో డేటింగ్‌కు వెళ్లినట్లు పేర్కొంది. అయితే, డేటింగ్ చేసిన వారందరితో శృంగారంలో పాల్గొనలేదని మోనెట్ డయాస్ పేర్కొనడం గమనార్హం. 11 మందితో శృంగారం చేసినపుడు వారిపైన తనకు ప్రేమ రాలేదని, అందుకే వారికి విడాకులు ఇచ్చి ఇప్పుడు 12వ మ్యారేజ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఈమెకున్న ఈ డిఫరెంట్ వ్యసనం గురించి తెలుసుకుని అందరూ షాక్ అవుతున్నారు.

    Also Read: ఆ విషయంలో ప్రతి ఒక్కరూ మనసు చెప్పింది వినాల్సిందే..?

    Tags