https://oktelugu.com/

అనసూయకు హిందీ ఆఫర్..

`జబర్దస్త్ ‘ కామెడీ షో నటులతో పాటు యాంకర్లకు కూడా విపరీతమైన గుర్తింపు తెచ్చి పెట్టింది. రష్మీ, అనసూయ లిద్దరు కూడా తెలుగు నట గ్లామర్ యాంకర్ లుగా అనూహ్య గుర్తింపు తెచ్చుకొన్నారు. ఇటు బుల్లితెర, అటు బడా తెర ల్లో కూడా వాళ్లకు మంచి ఆఫర్లే వచ్చాయి. ఆ క్రమంలో అనసూయ రెండు రంగాల్లో విజయవంతంగా రాణిస్తూ, బిజీబిజీగా గడిపేస్తోంది. తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు . మరీ ముఖ్యంగా […]

Written By:
  • admin
  • , Updated On : May 11, 2020 / 05:40 PM IST
    Follow us on

    `జబర్దస్త్ ‘ కామెడీ షో నటులతో పాటు యాంకర్లకు కూడా విపరీతమైన గుర్తింపు తెచ్చి పెట్టింది. రష్మీ, అనసూయ లిద్దరు కూడా తెలుగు నట గ్లామర్ యాంకర్ లుగా అనూహ్య గుర్తింపు తెచ్చుకొన్నారు. ఇటు బుల్లితెర, అటు బడా తెర ల్లో కూడా వాళ్లకు మంచి ఆఫర్లే వచ్చాయి. ఆ క్రమంలో అనసూయ రెండు రంగాల్లో విజయవంతంగా రాణిస్తూ, బిజీబిజీగా గడిపేస్తోంది. తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు . మరీ ముఖ్యంగా ” రంగస్థలం ” చిత్రం లో రంగమ్మత్త పాత్ర అనసూయ లోని ప్రతిభకి ఒక మచ్చుతునక. అలా తెలుగు కే పరిమితమై పోయిన అనసూయ ఇప్పడు హిందీ లో కూడా అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఆ అవకాశం సినిమాలో కాదు, సీరియల్ లో వచ్చింది అని తెలుస్తోంది.

    Also Read: పూనమ్ పాండేపై కేసు నమోదు..

    హిందీ సీరియల్స్ కు దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది .దానికి తోడు మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో కూడా హిందీ సీరియల్స్ ను విపరీతంగా ఆదరిస్తారు. అలాంటి సమయంలో ఇప్పటికే హిందీలో పాపులర్ అయిన ఓ సీరియల్ లో ఓ కీలక పాత్ర కోసం అనసూయను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇంతవరకు తెలుగు నుంచి హిందీ కి సినీ తారలు వెళ్లారు గాని టి వి తారలు వెళ్లిన దాఖలాలు లేవు ఆ విషయం లో అనసూయ మొదటి అడుగు వేస్తోంది అనుకోవాలి ..