గబ్బర్ సింగ్ కి ఎనిమిదేళ్లు నిండాయి

  సరిగ్గ ఎనిమిదేళ్ల క్రితం, 2012 ఇదే మే 11 న పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ విడుదలై సంచలనాన్ని సృష్టించింది .అంతకుముందు సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ మూవీతో కెరీర్ గ్రాఫ్ మళ్ళీ దార్లో పడింది.ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సల్మాన్ ఖాన్ హీరో గా వచ్చిన హిందీ హిట్ మూవీ ” దబాంగ్ ” […]

Written By: admin, Updated On : May 11, 2020 7:04 pm
Follow us on

 

సరిగ్గ ఎనిమిదేళ్ల క్రితం, 2012 ఇదే మే 11 న పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ విడుదలై సంచలనాన్ని సృష్టించింది .అంతకుముందు సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ మూవీతో కెరీర్ గ్రాఫ్ మళ్ళీ దార్లో పడింది.ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సల్మాన్ ఖాన్ హీరో గా వచ్చిన హిందీ హిట్ మూవీ ” దబాంగ్ ” కి తెలుగు రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వసూల్ చేసింది.ముప్ఫైకోట్ల బడ్జట్ తో తీసిన ఈ చిత్రం సుమారు 150 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన దర్శకుడు హరీష్ శంకర్ ఒరిజినల్ కథకు చాలా మార్పులు చేసి స్ట్రైట్ మూవీ అన్నట్లుగా తీర్చిదిద్దాడు.

ముఖ్యంగా హరీష్ శంకర్ రాసిన వన్ లైనర్స్ తెరపై ఓ రేంజ్ లో పేలాయి. కాగా ఈ సినిమా విడుదలై నేటికీ 8 సంవత్సరాలు పూర్తి అయ్యాయి .. 2012 మే 11న గబ్బర్ సింగ్ విడుదలైంది. సుమారు 307 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శించబడిన ” గబ్బర్ సింగ్ ” పవన్ కళ్యాణ్ కెరీర్ ని మరో మెట్టు ఎక్కించిన చిత్రంగా నేటికీ మిగిలిపోయింది . విశేషమేమిటంటే గబ్బర్ సింగ్ కాంబో లో త్వరలో ఒక సినిమా రాబోతుంది.కాగా ఆ చిత్రాన్ని హరీష్ శంకర్ తనదైన స్టైల్ లో పవన్ కళ్యాణ్ రేంజ్ పెరిగేలా రూపొందిస్తాడట ….