17నుంచి పట్టాలెక్కనున్న మెట్రో ట్రైన్?

కేంద్రం విధించిన లాక్డౌన్ మూడోదశ ఈనెల 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రం సీరియస్ గా చర్చిస్తుంది. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈమేరకు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను తీసుకుంటోంది. కేంద్రం ఇప్పటికే లాక్డౌన్ 2.0లో ప్రజారవాణాకు సంబంధించి కొన్ని సడలింపులిచ్చింది. రేపటి రైల్వే శాఖ కొన్ని స్పెషల్ ట్రైన్ నడిపించేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి 15 స్పెషల్ ట్రైన్లను […]

Written By: Neelambaram, Updated On : May 11, 2020 11:44 pm
Follow us on

కేంద్రం విధించిన లాక్డౌన్ మూడోదశ ఈనెల 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రం సీరియస్ గా చర్చిస్తుంది. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈమేరకు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను తీసుకుంటోంది. కేంద్రం ఇప్పటికే లాక్డౌన్ 2.0లో ప్రజారవాణాకు సంబంధించి కొన్ని సడలింపులిచ్చింది. రేపటి రైల్వే శాఖ కొన్ని స్పెషల్ ట్రైన్ నడిపించేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి 15 స్పెషల్ ట్రైన్లను ఆయా రాష్ట్రాలకు నడిపిందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోన్న తరుణంలో మెట్రో ట్రైన్స్ ఎప్పటి నుంచి నడుస్తాయనే చర్చ నడుస్తోంది.

దేశంలో లాక్డౌన్ కారణంగా గడిచిన నెలన్నర రోజులుగా గూడ్స్ ట్రైన్లు మాత్రమే నడుస్తున్నాయి. వలస కార్మికులను తరలిస్తున్న శ్రామిక్ రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. లాక్డౌన్ మూడోదశ ముగిస్తుండటంతో ప్రయాణీకులకు సంబంధించి రైళ్లను నడిపే విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు 12 నుంచి దశలవారీగా ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈనేపథ్యంలోనే 17తర్వాత మెట్రో ట్రైన్లకు అనుమతించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం. కేంద్రం అనుమతిస్తే ఆయా రాష్ట్రాల్లో మెట్రో ట్రైన్లను నడిపించేందుకు ఆయా ప్రభుత్వాలు సిద్ధమవుతోన్నాయి.

అయితే హైదరాబాద్ ప్రాంతం రెడ్ జోన్ ఫరిధిలో ఉంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులన్నీ ప్రస్తుతం హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో హైదరాబాద్లో మైట్రో ట్రైన్ సర్వీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా నేటి నుంచి ఐటీ కంపెనీలు తెరుచుకున్నాయి. ఒకవేళ కేంద్రం మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం రాష్ట్రంలో మెట్రో రైళ్లకు అనుమతులిచ్చేందుకు సర్కార్ మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా తెలంగాణలో ఆర్టీసీ బస్సులు త్వరలోనే రోడ్డెక్కేందుకు సిద్ధమవుతోన్నాయి.