Anchor Anasuya: అనసూయ క్రేజ్ ప్రస్తుతం హీరోయిన్ల స్థాయిలో ఉంది. అందుకే అనసూయ కోసం ప్రత్యేకంగా తమ కథల్లో పాత్రలను సృష్టిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో అనసూయకు మంచి అవకాశాలు వస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రభుదేవా తమిళ సినిమాలో నటించిన అనసూయ.. మలయాళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. మమ్ముట్టి హీరోగా వచ్చిన భీష్మపర్వం సినిమాలో కీ రోల్ చేసింది.

మార్చి 4న రిలీజైన ఈ మూవీకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మమ్ముట్టి లాంటి స్టార్‌తో నటించడం వల్ల అనసూయకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. దీంతో ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారట. అయితే, అనసూయ కెరీర్ ను విజయాల పరంపర వైపు మలుపు తిప్పిన సినిమా ‘‘రంగస్థలం’. బుల్లితెర పై కామెడీ ప్రోగ్రామ్స్ లో ఐటమ్ సాంగ్స్ కోసం ఎక్స్ పోజింగ్ చేస్తూ కాలం నెట్టుకొస్తున్న అనసూయకి, రంగమ్మత్త పాత్ర దొరకడం ఆమె అదృష్టం.
Also Read: Sonakshi Sinha: స్టార్ హీరోయిన్ అభ్యర్ధన.. వాటిని ప్రసారం చేయొద్దు అట
ఆమెకు మళ్ళీ అలాంటి అదృష్టాన్నే ఇవ్వబోతున్నాడు సుకుమార్. ఆమెలో కూడా మంచి నటి ఉందని ప్రూవ్ చేసిన సుక్కు, ఇప్పుడు ఆమెలో మంచి నటి కాదు, మహానటి ఉందని ప్రూవ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం చేస్తోన్న ‘పుష్ప 2′ చిత్రంలో అనసూయ పాత్రను సుక్కు చాలా బాగా డిజైన్ చేశాడట.
కాగా ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర కన్నా, ‘పుష్ప 2’ సినిమాలో అనసూయ చేస్తోన్న రోల్ మరింత గొప్పగా ఉంటుందని, ఒకవిధంగా రంగమ్మత్త పాత్ర కంటే గొప్పది అని అనసూయ చెప్పుకొస్తోంది. పైగా పుష్ప కథని మొత్తంగా మలుపు తిప్పే పాత్రలో అనసూయ కనిపించబోతుంది. మొదటి పార్ట్ లో అనసూయ పాత్రను పెద్దగా రివీల్ చేయలేదు. సెకండ్ పార్ట్ లో పూర్తిగా రివీల్ చేయనున్నారు. మొత్తానికి అనసూయకు అవకాశాల వెల్లువలా వస్తున్నాయి. కారణం మాత్రం సుక్కునే.
Also Read: Radhe Shyam Movie Business: ’రాధేశ్యామ్’కి బిజినెస్ ఎంత జరిగిందో తెలుసా ?