Ramayana Hanuman role: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా బాలీవుడ్ ‘రామాయణ్'(Ramayan : Part 1) గురించే చర్చ నడుస్తోంది. ఎందుకంటే నితీష్ తివారి(Nitish Tiwari) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని నేడు విడుదల చేసారు కాబట్టి. కొంతమందికి ఈ టీజర్ బాగా నచ్చింది , కానీ అత్యధిక శాతం మందికి మాత్రం నచ్చలేదు. 1800 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నామని చెప్పారు , కానీ అక్కడ చూస్తుంటే కనీసం 400 కోట్లు కూడా ఖర్చు చేసినట్టు లేదు. ఈ టీజర్ లోని విజువల్స్ కంటే , బాలీవుడ్ లో రామాయణం మీద తీసిన సీరియల్స్ లోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, దీని కోసమా ఇన్ని రోజుల నుండి కష్టపడుతోంది అంటూ విమర్శిస్తున్నారు. కానీ రాముడిగా రణబీర్ సింగ్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడని , ఆయన వైపు నుండి ఎలాంటి కంప్లైంట్స్ లేవని చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాలో రావణుడి క్యారెక్టర్ ని కన్నడ సూపర్ స్టార్ ‘యాష్’ చేస్తుండగా, సీత పాత్రని సాయి పల్లవి చేస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సన్నీ డియోల్ చేస్తున్నాడు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా, ఈ చిత్రం నుండి హనుమంతుడి గ్లింప్స్ వీడియో వస్తుందని అంతా అనుకున్నారు. కానీ రాముడి గ్లింప్స్ ని వదిలారు మేకర్స్. అయితే సన్నీ డియోల్ కంటే ముందుగానే ఈ పాత్ర కోసం ఒక టాలీవుడ్ హీరో ని సంప్రదించారట మేకర్స్. ఆ హీరో మరెవరో కాదు , రానా దగ్గుబాటి. ఆయన శరీర సౌష్టవం, ఆరా ఫ్రేమింగ్ వగైరా వంటివి పర్ఫెక్ట్ గా ఉంటాయి కాబట్టి, హనుమంతుడి పాత్రకు ఆయన మాత్రమే సూట్ అవుతాడని అతన్ని సంప్రదించారట. కానీ ఎందుకో రానా ఈ చిత్రం లో నటించడానికి ఆసక్తి చూపించలేదు.
Also Read: రణబీర్ కపూర్ ‘రామాయణ్’ టీజర్ రివ్యూ : విజువల్ వండర్ కి సరికొత్త నిర్వచనం..
అంతే కాదు, ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి ని కూడా సంప్రదించారట. ఆయన నటించడానికి సిద్దమే కానీ, ఆ సమయం లో ‘కాంతారా’ షూటింగ్ లో ఉండడం వల్ల ఈ చిత్రానికి డేట్స్ కేటాయించలేకపోయాడు అంట. అలా చివరికి ఈ పాత్ర సన్నీ డియోల్ చేతుల్లోకి వెళ్ళింది. దీపావళి కానుకగా ఈ చిత్రం ఈ ఏడాది లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతే కాకుండా రెండవ భాగాన్ని కూడా ఎక్కువ కాలం గ్యాప్ ఇవ్వకుండా, మొదటి భాగం విడుదలైన అతి తక్కువ సమయం లోనే పేక్షకుల ముందుకు తీసుకొని రావాలని అనుకుంటున్నారట. నేడు విడుదల చేసిన టీజర్ కి అయితే రెస్పాన్స్ బాగాలేదు , భవిష్యత్తులో వచ్చే కంటెంట్ అయినా బాగా ఉంటే ఈ సినిమా రేంజ్ మారొచ్చు, లేదంటే మరో ఆదిపురుష్ అవుతుంది జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు నెటిజెన్స్.
