Renault Night and Day Edition cars : రెనాల్ట్ నుంచి నైట్ అండ్ డే ఎడిషన్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈ కార్లు తక్కువ సంఖ్యలో అంటే కేవలం 1600 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు ఇప్పటికే బుకింగ్ చేసుకోవడం ప్రారంభించారు. అంతేకాకుండా పండుగ సీజన్ సందర్భంగా కొత్త కారు కొనాలనే ఉద్దేశంతో ఈ మోడల్స్ ను కొనుగోలు చేయడం బెస్ట్ ఆప్షన్ అని కొందరు అంటున్నారు.

Written By: Chai Muchhata, Updated On : September 18, 2024 7:48 pm

Renault Night and Day Edition cars released with these special features

Follow us on

Renault Night and Day Edition cars : కొత్తకార్లు మార్కెట్లోకి వచ్చే తరుణం ఆసన్నమైంది. పండుగల సీజన్ కావడంతో ఒక్కో కంపెనీ కొత్త ఎడిషన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. లేటేస్టుగా రెనాల్ట్ కంపెనీకి చెందిన మూడు కార్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి ఇప్పటికే ఉన్న వాటికి అప్డేట్ వెర్షన్ గా అందుబాటులోకి వచ్చాయి. పాత మోడళ్ల కంటే ఇవి లేటేస్ట్ ఫీచర్లను కలిగి ఉండడంతో పాటు ఆకర్షణీయమైన ధరలను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ కార్ల డిజైన్ చూసి కార్ల ప్రియులు మురిసిపోతున్నారు. అయితే ఈ కార్లు పరిమిత సంఖ్యోలనే ఉన్నాయి. దీంతో వీటికి డిమాండ్ పెరిగిపోతుంది. ఇంతకీ ఈ కార్లలో ఏముంది? వీటిని ఎందుకు ఎక్కువగా కోరుకుంటున్నారు?

రెనాల్ట్ కంపెనీ కార్ల ప్రియుల కోసం ఇప్పటికే చాలా మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చి అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు కొత్తగా మూడు కార్లను సెప్టెంబర్ 17న రిలీజ్ చేశారు. వీటిలో ఒకటి రెనాల్ట్ కిగర్, ట్రైబర్, క్విడ్ కార్ల నైట్ అండ్ డే ఎడిషన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి సరికొత్త ఫీచర్లతో పాటు ఆకట్టుకునే డిజైన్ ను కలిగి ఉన్నాయి. ఈ మూడు కార్లలో ఒకే రకమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉన్నాయి.

వీటిలో డ్యూయెల్ టోన్, మిస్టరీ బ్లాక్ రూప్ ఉన్నాయి. కాస్మెటిక్ మార్పుల్లో భాగంగా పియానో బ్లాక్ గ్రిల్, వీల్ కవర్లు ఉండనున్నాయి. కిగర్ మోడల్లో టెయిల్ అలంకరణ ఆకర్షిస్తుంది. పై అన్నీ కార్లలో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ స్మారట్ ఫోన్ రెప్పికేషన ఉన్నాయి. సేప్టీ కోసం రియర్ వ్యూ కెమెరా ఉంది. ట్రైబర్ కారులో పవర్ విండో వల్ల సేప్టీ ఇస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 17 నుంచి వీటిని అందుబాటులో ఉంచారు.

ఈ కార్లు తక్కువ సంఖ్యలో అంటే కేవలం 1600 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు ఇప్పటికే బుకింగ్ చేసుకోవడం ప్రారంభించారు. అంతేకాకుండా పండుగ సీజన్ సందర్భంగా కొత్త కారు కొనాలనే ఉద్దేశంతో ఈ మోడల్స్ ను కొనుగోలు చేయడం బెస్ట్ ఆప్షన్ అని కొందరు అంటున్నారు. అయితే ఇవి కొత్త కస్టమర్లకు మాత్రమే కాకుండా కారు సేల్స్ పెంచుకునేందుకు మంచి సమయం అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. రెనాల్ట్ కార్లను కొనుగోలు చేసిన చాలా మంది కొత్త మోడల్స్ కావాలనుకునేవారికి ఇవి మంచిఆప్షన్ గా నిలుస్తాయని అంటున్నారు.

రెనాల్ట్ కొత్త కార్ల ధర విషయానికొస్తే.. క్విడ్ నైట్ అండ్ డే ఎడిషన్ రూ.4.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. కిగర్ కారు రూ.6.75 లక్షల ధర ఉంది. ట్రైబర్ కారును రూ.7.25 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. రెనాల్ట్ ట్రైబర్ ఇప్పటికే ఉన్న ఆర్ఎక్స్ ఎల్ వెర్షన్ కంటే రూ. 20 వేలు ఎక్కువ. సరికొత్త అప్డేట్ తో పాటు ఎక్సీటీరియర్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఈ కార్ల సేల్స్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.