Anasuya Bharadwaj: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే సెలబ్రిటీలలో ఒకరు యాంకర్ అనసూయ(Anchor Anasuya). తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉండడమే కాకుండా, అప్పుడప్పుడు ఈమె కొన్ని అంశాలపై చేసే వ్యాఖ్యలు పెద్ద వివాదాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఫెమినిజం భావాలు ఉన్న అమ్మాయి లాగా కనిపిస్తుంది కానీ, కేవలం కొంతమందికి మాత్రమే తన ఫెమినిజం భావాలను చూపిస్తూ ఉంటుంది. దీని వల్ల ఆమె సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు అవుతూ ఉంటుంది. రీసెంట్ గా ప్రముఖ నటుడు శివాజీ హీరోయిన్ వేసుకునే దుస్తుల గురించి మాట్లాడడం, దానికి అనసూయ కౌంటర్లు ఇవ్వడం, శివాజీ వైపు నెటిజెన్స్ అందరూ నిలబడి సపోర్టు చేయడం, సామాన్లు అనే పదం బూతుగా భావించే అనసూయ, జబర్దస్త్ షోలో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టిందో చూడండి అంటూ ఆమె పాత వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో తిప్పారు నెటిజెన్స్.
ముఖ్యంగా జబర్దస్త్ షోలోని ఒక ఎపిసోడ్ లో ‘రాశి ఫలాలు’ ని ‘రాశి గారి ఫలాలు’ అం మాట్లాడడం, ఆ వీడియో బాగా వైరల్ అయ్యి రాశి వరకు వెళ్లడం తో ఆమె కూడా అనసూయ పై అసహనం వ్యక్తం చేస్తూ నిన్న ఒక వీడియో విడుదల చేయడం, ఆ వీడియో కి అనసూయ సమాధానం చెప్తూ, రాశి కి క్షమాపణలు చెప్పి, తానూ ఏ ఉద్దేశ్యంతో అన్నానో వివరణ ఇవ్వడం వంటివి జరిగాయి. అయితే అనసూయ కాసేపటి క్రితమే తన ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ లో ఒక స్టోరీ పెట్టింది. ఆ స్టోరీ లో ‘ హీరోయిన్ తెరపైన కాదు. నిజ జీవితం లో నటించకుండా, ఉన్నది ఉన్నట్టు సత్యం మాట్లాడే ధైర్యం, సొంత దారిలో నడిచే శక్తి, సరైన దానికి నిలబడే గుండె. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లే నిజమైన హీరోయిన్లు, మిగిలిన వాళ్ళు కేవలం నటులు మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చింది.
ఈ వ్యాఖ్యలు అనసూయ ఏ హీరోయిన్ ని ఉద్దేశించి మాట్లాడింది?, నిన్ననే రాశి కి క్షమాపణలు చెప్పింది కాబట్టి, కచ్చితంగా ఆమె గురించి అయితే కాదు. మరి ఎవరి గురించి?, ఈమెని గెలికిన ఆ హీరోయిన్ ఎవరు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక యాంకరింగ్ రంగం నుండి సినిమాల్లోకి వెళ్లిన అనసూయ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా టాలీవుడ్ లో మంచి అవకాశాలు సంపాదిస్తూ బిజీ ఆర్టిస్టు గా కొనసాగుతుంది. ‘పుష్ప’ సిరీస్ తో అయితే ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక రాబోయే రోజుల్లో ఆమె రేంజ్ ఎలా ఉండబోతుందో చూడాలి.