ప్రముఖుల పాడు పని.. ఫాంహౌస్ లో వ్యభిచారం

వాళ్లు ప్రముఖులు.. సమాజంలో పేరు ఉన్న వాళ్లు.. హైదరాబాద్ లో దర్జాగా నివసిస్తున్నారు. కానీ వారికి కోరిక పుట్టింది. అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలనిపించింది. దీంతో హైదరాబాద్ కు దూరంగా మెదక్ జిల్లాలోని ఓ ఫాంహౌస్ లో సెట్ చేసుకున్నారు.కానీ ట్విస్ట్ ఇక్కడే ఉంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావ్ పేట గ్రామ సమీపంలో ఓ ఫాంహౌస్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని జర్నలిస్టులకు, పోలీసులకు సమాచారం అందింది. అమ్మాయిలను ఆ ఫాంహౌస్ కు రహస్యంగా తరలించి వ్యభిచారం […]

Written By: NARESH, Updated On : July 19, 2021 10:03 am
Follow us on

వాళ్లు ప్రముఖులు.. సమాజంలో పేరు ఉన్న వాళ్లు.. హైదరాబాద్ లో దర్జాగా నివసిస్తున్నారు. కానీ వారికి కోరిక పుట్టింది. అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలనిపించింది. దీంతో హైదరాబాద్ కు దూరంగా మెదక్ జిల్లాలోని ఓ ఫాంహౌస్ లో సెట్ చేసుకున్నారు.కానీ ట్విస్ట్ ఇక్కడే ఉంది.

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావ్ పేట గ్రామ సమీపంలో ఓ ఫాంహౌస్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని జర్నలిస్టులకు, పోలీసులకు సమాచారం అందింది. అమ్మాయిలను ఆ ఫాంహౌస్ కు రహస్యంగా తరలించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తలిసింది. దీంతో పోలీసులు అర్ధరాత్రి ఫాంహౌస్ పై దాడి చేశారు. ఈ దాడుల్లో 14 మంది పోలీసులకు చిక్కగా.. పలువురు ప్రముఖులు తప్పించుకోవడం గమనార్హం. 11 మంది పారిపోయినట్లు ఎస్ఐ తెలిపారు.

ఈ క్రమంలోనే ఫాంహౌస్ వాచ్ మెన్ ప్రమోద్ పై కేసు నమోదు చేశారు. ఈ ఫాంహౌస్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిది అని తెలిసింది. అక్కడున్న కొంతమంది ప్రముఖు వ్యక్తులకు పోలీసులు వస్తున్నారనే ముందస్తు సమాచారం అందడంతో వారంతా పరారైనట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ దాడిలో ముగ్గురు ప్రముఖులతోపాటు మరో ఆరుగురు, ఐదుగురు అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.