https://oktelugu.com/

అవ‌‌స‌రానికి వాడుకుంటారు.. తీరిన‌ త‌ర్వాత ఆడుకుంటారుః అన‌సూయ‌

అనసూయ‌ను యాంక‌ర్ అని కాకుండా.. యాక్ట్రెస్ అని పిల‌వాల్సిన స‌మ‌యం వ‌చ్చేసిన‌ట్టుంది. స్మాల్ స్క్రీన్ పై త‌న‌దైన టాలెంట్ చూపించి.. బిగ్ స్క్రీన్ ప్ర‌మోష‌న్ కొట్టేసిన అన‌సూయ‌.. అక్క‌డ‌కూడా స‌త్తా చాటుతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలు ఉండ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. లేడీ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ల విషయంలో ఈ ‘రంగ‌మ్మ‌త్త‌’ సూపర్ ఛాయిస్ గా కనిపిస్తోంది మేకర్స్ కు! అయితే.. సోష‌ల్ మీడియాలోనూ ఈ సుంద‌రి యాక్టివ్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. Also Read: […]

Written By:
  • Rocky
  • , Updated On : February 16, 2021 / 10:43 AM IST
    Follow us on


    అనసూయ‌ను యాంక‌ర్ అని కాకుండా.. యాక్ట్రెస్ అని పిల‌వాల్సిన స‌మ‌యం వ‌చ్చేసిన‌ట్టుంది. స్మాల్ స్క్రీన్ పై త‌న‌దైన టాలెంట్ చూపించి.. బిగ్ స్క్రీన్ ప్ర‌మోష‌న్ కొట్టేసిన అన‌సూయ‌.. అక్క‌డ‌కూడా స‌త్తా చాటుతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలు ఉండ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. లేడీ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ల విషయంలో ఈ ‘రంగ‌మ్మ‌త్త‌’ సూపర్ ఛాయిస్ గా కనిపిస్తోంది మేకర్స్ కు! అయితే.. సోష‌ల్ మీడియాలోనూ ఈ సుంద‌రి యాక్టివ్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

    Also Read: మహేష్ ‘సర్కారి వారి పాట’ నుంచి సర్ ప్రైజ్

    హాట్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకున్న‌ అన‌సూయ సామాజిక మాధ్య‌మాల్లో ఎంత‌ యాక్టివ్ గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఆమె పోస్ట్ చేసిందంటే.. ఖ‌చ్చితంగా అందులో ‘విష‌యం’ ఉంటుంది. సామాజిక అంశాల‌తోపాటు వ్య‌క్తిగ‌త అంశాల‌ను కూడా షేర్ చేసే అన‌సూయ‌.. లేటెస్ట్ గా ఓ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ చూడ‌గానే క‌ళ్లు పెద్ద‌వి చేస్తున్నారు అంద‌రూ!

    ఇంత‌కీ ఆ పోస్టు ఏమంటే.. “అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు.” అంటూ రాసుకొచ్చిందీ బ్యూటీ. ఈ బోల్డ్‌ స్టేట్ మెంట్ తో సోషల్ మీడియాను మ‌రింత వేడెక్కించింది అన‌సూయ‌. ఈ వ్యాఖ్య‌లు చూసిన వారంతా ఏం జ‌రిగి ఉంటుందో అని అనుకుంటున్నారు. అయితే.. చివ‌ర్లో ‘కమింగ్ సూన్’ అన్న పదాన్ని చూసి ఇదేదో సినిమాకు సంబంధించిన విషయం కావొచ్చులే అని కూల్ అవుతున్నారు.

    Also Read: క్రేజీ కాంబినేషన్ ఇక వచ్చే సంక్రాంతికే !

    అయితే.. నిజంగా అవి సినిమాకు సంబంధించిన వ్యాఖ్యలే. అనసూయ లేటెస్ట్ గా చేస్తున్న ఓ ఐటం సాంగ్ లోని లిరిక్స్ ఇవి. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ‌బన్నీ వాసు నిర్మాత‌గా ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కార్తికేయ – లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటిస్తున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

    కాగా.. ఈ సినిమాలో అనసూయ ఓ మాస్ మ‌సాలా ఐట‌మ్ సాంగ్ లో దుమ్ము లేపుతోంది. దానికి సంబంధించిన లిరిక్సే అవి. ఈ మాస్ బీట్ సాంగ్ ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయబోతున్నారు. ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా ఇలా ప్రకటించింది అనసూయ. కాగా.. ఈ సినిమాలో ‌హీరో కార్తికేయ మార్చురీ వ్యాన్ డ్రైవర్ గా కనిపించబోతుండగా.. లావణ్య త్రిపాఠి నర్స్ గా కనిపించనుంది. ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కాబోతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్