ఆడలేక.. పిచ్‌పై విమర్శలు : ఇంగ్లండ్‌ ప్లేయర్ల వితండ వాదన

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ పరాజయంతో తర్వాత భారత్ పుంజుకుంది. విజయమే లక్ష్యంగా రెండో టెస్ట్‌ను ప్రారంభించిన భారత్ తొలి నుంచి దూకుడుతో దూసుకెళ్లింది. ఓ వైపు భారత బ్యాట్స్‌మెన్ 329 పరుగులతో రాణించగా.. బౌలర్లు కూడా రెచ్చిపోయారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్ విలవిలలాడిపోయారు. 59.5 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ కుప్పకూలింది. దీంతో భారత్ 195 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ నిలకడగా మ్యాచ్ […]

Written By: Srinivas, Updated On : February 16, 2021 10:32 am
Follow us on


ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ పరాజయంతో తర్వాత భారత్ పుంజుకుంది. విజయమే లక్ష్యంగా రెండో టెస్ట్‌ను ప్రారంభించిన భారత్ తొలి నుంచి దూకుడుతో దూసుకెళ్లింది. ఓ వైపు భారత బ్యాట్స్‌మెన్ 329 పరుగులతో రాణించగా.. బౌలర్లు కూడా రెచ్చిపోయారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్ విలవిలలాడిపోయారు. 59.5 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ కుప్పకూలింది. దీంతో భారత్ 195 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ నిలకడగా మ్యాచ్ ప్రారంభించింది. 1.2 ఓవర్ల వద్ద భారత్ గిల్ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమాయానికి 18 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయిన భారత్ 54 పరుగుుల చేసింది. ఆట ముగిసే సమయానికి క్రీజులో పుజారా ( 7), రోహిత్ (25) ఉన్నారు. ఇక మూడో రోజు ఆటను భారత బ్యాట్స్ మెన్ ప్రారంభించారు.

Also Read: వైరల్ వీడియో: కోహ్లీ విజిల్స్.. ఊగిపోయిన ఫ్యాన్స్.. దద్దరిల్లిన స్టేడియం

అయితే.. ‘ఆడలేక మద్దెల దరువు’ అన్నట్లు ఇంగ్లండ్‌ ప్లేయర్స్‌ తమ ఆటను ప్రదర్శించలేక పిచ్‌పై విమర్శలకు పాల్పడుతున్నారు. చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి టెస్టుతో పోలిస్తే రెండో టెస్టులో తొలి రోజు నుంచే బంతి బాగా తిరుగుతోందని మార్క్‌ వా, మైకెల్‌ వాన్‌ వ్యాఖ్యలు చేశారు. వీళ్లిద్దరే కాదు.. ఇంగ్లండ్‌ మద్దతుదారులు చాలా మంది చెపాక్‌ పిచ్‌ విషయమై గగ్గోలు పెడుతున్నారు. తొలి టెస్టులో తమను ఓడించిన ఇంగ్లండ్‌ను దెబ్బతీయడానికి భారత్‌ స్పిన్‌ పిచ్‌ తయారు చేసుకుందన్నది పరోక్షంగా వారు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం అసాధ్యం అన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. కానీ.. ఇదే పిచ్‌ మీద రోహిత్‌ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. రోహిత్‌ టాప్‌ఆర్డర్‌‌ బ్యాట్స్‌మన్‌ కాబట్టి అతను భారీ శతకాన్ని సాధించడం విశేషం కాకపోయినా.. ఓ బౌలర్‌‌ అయిన అశ్విన్‌ ఎనిమిదో స్థానంలో వచ్చి సెంచరీ కొట్టేశాడు. స్పిన్‌ పిచ్‌పై బ్యాటింగ్‌ టెక్నిక్‌ ఎలా ఉండాలో వీరు ప్రదర్శించారు.

Also Read: అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గెలుపును ఇక ఆపలేరు

భారత్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో రహానె, పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి సైతం హాఫ్‌ సెంచరీ సాధించాడు. చెపాక్‌ పిచ్‌ గురించి ఫిర్యాదులు చేస్తున్న వారెవరికీ ఈ ఇన్నింగ్స్‌లు కనిపించకపోవడం విడ్డూరం. ఇదే స్టేడియంలో ఏమాత్రం జీవం లేని పిచ్‌పై తొలి టెస్టులో ఆ జట్టు 578 పరుగులు చేసింది. అప్పుడేమో పిచ్‌లో జీవం లేదు. బ్యాటింగ్‌కు మరీ ఇంత అనుకూలంగా ఉంటే ఎలా అన్న ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా మారే సరికి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం ఆడిలైడ్‌లో భారత్‌ 36 పరుగులకే కుప్పకూలితే ఆ పిచ్‌పై ఎవరైనా విమర్శలు చేశారా..? కానీ.. ఉపఖండంలో పిచ్‌లు స్పిన్‌కు కాస్త సహకరించగానే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ లాంటి జట్లు మద్దతుదారులు లబోదిబోమంటున్నారు.