Anasuya Husband: అటు మరదలు ఇటు భార్య… అనసూయ భర్తకు ఇంకా కష్టం ఏమనిపిస్తుంది?

దినచర్యలో వ్యాయామం ఉండేలా చూసుకుంటారు. ఇక అనసూయ ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్. అందుకే ఆమె పెళ్ళై పిల్లలు ఉన్నా పర్ఫెక్ట్ ఫిగర్ మైంటైన్ చేస్తున్నారు. తాజాగా అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఓ ఫోటో షేర్ చేశారు. ఆ ఫొటోలో జిమ్ లో అనసూయతో పాటు చెల్లి వైష్ణవి ఉన్నారు. మరదలు, భార్యతో కలిసి సుశాంక్ జిమ్ చేస్తున్నారన్న మాట.

Written By: Shiva, Updated On : June 15, 2023 8:17 am

Anasuya Husband

Follow us on

Anasuya Husband: అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ పని మాములుగా లేదు. అటు భార్యను ఇటు మరదలిని పెట్టుకొని వ్యాయామం చేస్తున్నాడు. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య వర్క్ అవుట్ చేస్తున్న సుశాంక్ దే అదృష్టమని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎంత సేపు జిమ్ చేసినా సుశాంక్ కి కష్టం తెలియదంటున్నారు. అనసూయ-సుశాంక్ లతో ఉన్న అనసూయ చెల్లి ఫోటో వైరల్ అవుతుంది. ఎంత బిజీ లైఫ్ అయినప్పటికీ సెలెబ్రిటీలు వ్యాయామానికి సమయం కేటాయిస్తారు. అందం ఆరోగ్యం లేకపోతే గ్లామర్ ఫీల్డ్ లో రాణించడం కష్టం. అందుకే కడుపు మాడ్చుకొని డైటింగ్ చేస్తారు.

దినచర్యలో వ్యాయామం ఉండేలా చూసుకుంటారు. ఇక అనసూయ ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్. అందుకే ఆమె పెళ్ళై పిల్లలు ఉన్నా పర్ఫెక్ట్ ఫిగర్ మైంటైన్ చేస్తున్నారు. తాజాగా అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఓ ఫోటో షేర్ చేశారు. ఆ ఫొటోలో జిమ్ లో అనసూయతో పాటు చెల్లి వైష్ణవి ఉన్నారు. మరదలు, భార్యతో కలిసి సుశాంక్ జిమ్ చేస్తున్నారన్న మాట. ఇటీవల అనసూయ 13వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్నారు.

భర్తతో పాటు థాయిలాండ్ వెళ్లారు. వారం రోజులకు పైగా అక్కడ ఉన్నారు. ఈ ట్రిప్ లో అనసూయ రెచ్చిపోయారు. ఏకంగా బికినీ వేసి మైండ్ బ్లాక్ చేశారు. గతంలో అనసూయ ఎన్నడూ బికినీ ధరించలేదు. మొదటిసారి ఆమె టూ పీస్ బికినీలో దర్శనమిచ్చారు. అనసూయ హాట్ లుక్ వైరల్ అయ్యింది. అనసూయను ఎంత హేట్ చేస్తే అంతగా రెచ్చిపోతుంది.

ఇటీవల అనసూయ హీరో విజయ్ దేవరకొండ మీద ఆరోపణలు చేశారు. విజయ్ దేవరకొండ వద్ద పనిచేసే వ్యక్తి డబ్బులు ఇచ్చి తనపై ట్రోలింగ్ చేయించాడని ఆమె అన్నారు. ఆ విషయం తెలిసి బాధపడ్డాను. విజయ్ దేవరకొండ మీద పగ పెంచుకున్నానని అన్నారు. అందుకే విజయ్ దేవరకొండను వీలు దొరికినప్పుడల్లా టార్గెట్ చేశానని అనసూయ అన్నారు. అయితే ఇకపై విజయ్ దేవరకొండతో వివాదాన్ని కొనసాగించాలని అనుకోవడం లేదన్నారు.