Shivatmika Rajashekar: స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ఆమెకు అడపాదడపా ఆఫర్స్ వస్తున్నా… స్టార్ అయ్యే మూవీ ఇంకా పడలేదు. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే కానీ కెరీర్లో ఎదిగే ఛాన్స్ లేదు. పరిశ్రమకు వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. 2019లో విడుదలైన దొరసాని మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆనంద్ దేవరకొండ కూడా ఇదే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు.
మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్నా, దొరసాని కమర్షియల్ గా ఆడలేదు. శివాత్మిక నటనకు ప్రశంసలు దక్కాయి. శివాత్మిక లేటెస్ట్ మూవీ రంగమార్తాండ. ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రకాష్ రాజ్ కూతురు పాత్రలో శివాత్మిక నటించారు. రంగమార్తాండ చిత్రం ప్రశంసలు అందుకుంది కానీ కాసులు కురవలేదు. మరోసారి ఆమెకు నిరాశ ఎదురైంది.
తెలుగుతో పాటు తమిళంలో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. చెప్పాలంటే కోలీవుడ్ లోనే ఆమెకు బెటర్ ఆఫర్స్ వస్తున్నాయి. చిన్నదో పెద్దదో హీరోయిన్ ఛాన్సులు దక్కుతున్నాయి. అందుకే అటువైపుగా ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా ఆదరణ ఉండదు. అదే సమస్యను శివాత్మిక ఎదుర్కొంటుంది. రాజశేఖర్, జీవిత పరిశ్రమలో పలుకుబడి ఉన్న సీనియర్ నటులు. అయినా కూతుళ్ళ కెరీర్ నిలబెట్టలేకపోతున్నారు.
ఇక సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. శివాత్మిక వరుస ఫోటో షూట్స్ తో కాకపుట్టిస్తున్నారు. తాజాగా చోళీ లెహంగా ధరించి సూపర్ హాట్ ఫోజులతో టెంపరేచర్ పెంచేసింది. శివాత్మిక అందాలు చూసి కుర్రాళ్ళు కామెంట్ చేయకుండా ఉండలేకున్నారు. శివాత్మిక లోని తెలియని గ్లామర్ యాంగిల్ గిలిగింతలు పెడుతుంది. శివాత్మిక లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.