Anasuya vs Roja: అనసూయ భరద్వాక్, నటి రోజా పరస్పరం వాదనకు దిగారు. వయసు విషయంలో వీరికి మనస్పర్థలు తలెత్తాయి. అనసూయను ఏమంటే ఆమె అగ్గిమీద గుగ్గిలం అవుతుందో అదే అంది రోజా. దానికి నొచ్చుకున్న అనసూయ తిరిగి స్ట్రాంగ్ పంచులు విసిరింది.
అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆమెపై హేటర్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అనసూయ తిరిగి వారికి కౌంటర్స్ ఇస్తూ ఉంటుంది. ఆమె అసలు తగ్గదు. అనసూయకు ఆంటీ అంటే అసలు నచ్చదు. అందుకే అనసూయను నొప్పించాలని ట్రోలర్స్ ఆంటీ అని కామెంట్స్ చేస్తుంటారు. ఒక స్థాయికి మించి ట్రోల్ చేసిన వారిపై అనసూయ కేసులు కూడా పెట్టింది. జైలుపాలైన వారు కూడా ఉన్నారు. తన వయసు మీద కామెంట్స్ చేస్తే అనసూయకు ఓ రేంజ్ లో మండుతుంది.
Also Read: అల్లు అర్జున్,అట్లీ చిత్రంలో విలన్ గా హాలీవుడ్ యాక్షన్ హీరో..కనీవినీ ఎరుగని రేంజ్ ప్లానింగ్!
అనసూయను అత్తా అనేసిన రోజా(Roja Selvamani) భారీ షాక్ ఇచ్చింది. డ్రామా జూనియర్స్ వేదికగా ఫైర్ బ్రాండ్స్ రోజా, అనసూయ మధ్య చిన్న మాటల యుద్ధం నడిచింది. మేటర్ లోకి వెళితే.. రోజా-అనసూయ వేదిక మీదకు ఎంట్రీ ఇస్తూ.. మేము అత్తాకోడళ్ళం, అన్నారు. ఇంతకీ మీలో అత్త ఎవరు కోడలు ఎవరు? అని యాంకర్ సుధీర్ అడిగాడు. ‘నేను కోడలు… అనసూయ అత్త’ అని రోజా సమాధానం చెప్పింది. దాంతో అనసూయ షాకైంది. నేను అత్త ఏంటి.. కోడలు అంది. ఆ మాటకు రోజా.. రంగస్థలం లో నీ క్యారెక్టర్ పేరేంటి? అని అనసూయను అడిగింది. అందుకు అనసూయ.. ‘రంగమ్మత్త’ అని సమాధానం చెప్పింది.
నువ్వు అత్తలా ఉన్నావు కాబట్టే నీకు రంగమ్మత్త క్యారెక్టర్ ఇచ్చారు… అని రోజా పంచ్ వేసింది. నాకైతే పుష్పలో శ్రీవల్లి పాత్ర ఇచ్చేవారని రోజా మరో పంచ్ వేయగా… అల్లు అర్జున్ కి ఫీలింగ్స్ వచ్చేవో లేదో కానీ, ప్రేక్షకులకు ఫీలింగ్స్ చచ్చేవి, అంటూ అనసూయ ఘాటైన పంచ్ వేసింది. ఎవరు అత్త? ఎవరు కోడలు అనే విషయంలో రోజా-అనసూయ వాదనకు దిగారు. ఈ క్రమంలో యాంకర్ సుధీర్, జడ్జి అనిల్ రావిపూడి సైతం బలయ్యారు. ఇదంతా కామెడీ కోసమే. డ్రామా జూనియర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ హైడ్రామా చూసి ఎంజాయ్ చేయవచ్చు.
Also Read: ఉదయ్ కిరణ్ చనిపోవడమే చాలా మంచిది అయ్యింది అంటూ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ సంచలన వ్యాఖ్యలు!
కాగా ఇటీవల రోజా బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె తిరిగి జబర్దస్త్ జడ్జిగా కూడా వస్తారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే నటి కుష్బూ కొనసాగుతున్నారు. అలాగే అనసూయ సైతం కొన్నాళ్ళు బుల్లితెరకు దూరమైంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోతో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా డ్రామా జూనియర్స్ లో సందడి చేసింది.
