Allu Arjun Atlee Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ రోజు రోజుకి బౌండరీలు దాటేస్తుంది. చూస్తుంటే ఇది మన తెలుగు సినిమా, లేదా ఇండియన్ సినిమాలాగానో అనిపించలేదు. ఒక పూర్తి స్థాయి హాలీవుడ్ చిత్రం ఎలా ఉంటుందో, అలా తెరకెక్కించే సినిమాలాగా అనిపిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో, అడుగడుగునా గ్రాండియర్ ఫీలింగ్ ని కలిగించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ అట్లీ. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అనేది మన అందరికీ తెలిసిందే. ఒక క్యారక్టర్ నెగటివ్ షేడ్స్ లో ఉంటుందని కూడా అన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారక్టర్ కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో, ఆస్కార్ అవార్డ్స్ గ్రహీత విల్ స్మిత్ ని ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ అమెరికాకు వెళ్లి విల్ స్మిత్(Will Smith) ని కలిశారట.
ఆయనకు ఈ స్టోరీ న్యారేషన్ మొత్తం వినిపించారట. హీరో క్యారక్టర్ కంటే పవర్ ఫుల్ గా ఉండడం తో పాటు, స్క్రిప్ట్ కూడా నచ్చడంతో ఆయన ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాదు ఆయన క్యారక్టర్ కి సంబంధించిన లుక్ టెస్ట్ ని కూడా పూర్తి చేశారట. ప్రస్తుతం అల్లు అర్జున్ అమెరికా లోనే ఉన్నాడు. ఇప్పటికే ఈ అల్లు అర్జున్ కి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో ని విడుదల చేశారు మేకర్స్. అలాగే రీసెంట్ గానే హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే వీడియో ని కూడా విడుదల చేశారు. ఇప్పుడు విల్ స్మిత్ కి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన వీడియో ని షూట్ చేశారట. ఒక మంచి అకేషన్ ని చూసి త్వరలోనే ఈ వీడియో ని విడుదల చేస్తారట మేకర్స్. ఈ ప్రకటన తో సోషల్ మీడియా మొత్తం షేక్ అవ్వుద్దని అంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు,రాజమౌళి కాంబినేషన్ లో ఒక అంతర్జాతీయ చిత్రం తెరకెక్కుతుంది. అల్లు అర్జున్, అట్లీ మూవీ ని చూస్తుంటే రాజమౌళి చిత్రం కంటే ఇదే పెద్దది లాగా అనిపిస్తుంది. ఈ రెండు సినిమాలు మన మార్కెట్ ని పాన్ వరల్డ్ కి విస్తరింపజేసే ప్రయత్నం లాగా భావించవచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరు ముందుగా పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ మీద జెండాలు పాతుతారో చూడాలి. ఇకపోతే అల్లు అర్జున్ అట్లీ మూవీ దీపికా పదుకొనే మాత్రమే కాకుండా మరో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఒకరు మృణాల్ ఠాకూర్. రీసెంట్ గానే మృణాల్ మరియు అల్లు అర్జున్ లపై ముంబై లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆమె క్యారక్టర్ కూడా ఈ చిత్రం లో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్. మిగిలిన ముగ్గురు హీరోయిన్స్ లో జాన్వీ కపూర్ ఖరారు అయ్యింది. మిగిలిన ఇద్దరు ఎవరో చూడాలి.