Anasuya : జబర్దస్త్ వేదికగా అనసూయ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. నటి కావాలని పరిశ్రమకు వచ్చిన అనసూయకు అవకాశాలు రాలేదు. దాంతో యాంకర్ గా మారింది. 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ కామెడీ షో ఆరంభమైంది. నాగబాబు, రోజా జడ్జెస్ గా ఎంపికయ్యారు. జబర్దస్త్ కి ముందు అనసూయ ఎవరో తెలియదు. ఈ షోతో అనసూయ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. తెలుగు యాంకర్స్ లో స్కిన్ షో కల్చర్ లేదు. నిండైన బట్టల్లో యాంకర్స్ కనిపించాలనే సాంప్రదాయాన్ని అనసూయ బ్రేక్ చేసింది. ఆ కోణంలో అనసూయ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి.
పొట్టి బట్టల్లో ఆడియన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చింది. అనసూయ డ్రెస్సింగ్ పై ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ అనసూయ ఎన్నడూ కేర్ చేయలేదు. తన డ్రెస్సింగ్ పై వచ్చే విమర్శలను అదే స్థాయిలో తిప్పి కొట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో స్టార్ యాంకర్ అయ్యింది. అనంతరం ఆమెకు సినిమా అవకాశాలు లభించాయి. లీడ్ రోల్స్ తో పాటు స్టార్ హీరోల చిత్రాల్లో అనసూయ కీలక రోల్స్ చేస్తుంది. నటిగా బిజీ కావడంతో బుల్లితెరకు కొన్నేళ్లు దూరమైంది.
Also Read : శేఖర్ మాస్టర్ పై అనసూయ ఫైర్..కంట్రోల్ లో ఉండు అంటూ వార్నింగ్!
అనసూయ విలక్షణ పాత్రలు చేస్తూ దర్శక నిర్మాతల దృష్టిలో పడుతుంది. విమానం మూవీలో అనసూయ వేశ్య పాత్ర చేయడం విశేషం. కొందరు హీరోయిన్స్ మాత్రమే వేశ్యగా నటించేందుకు సాహసం చేస్తారు. పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో విలన్ రోల్ చేసి మెప్పించింది. ఆ మధ్య ఇకపై బుల్లితెర షోలు చేసేది లేదని తెగేసి చెప్పింది. మనసు మార్చుకున్న అనసూయ స్టార్ మా లో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో చేస్తుంది. ఫస్ట్ సీజన్ విజయవంతం కావడంతో, సీజన్ 2 ఇటీవల మొదలైంది.
కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో అనసూయ మరోసారి గ్లామర్ షోకి తెరలేపింది. మరో జడ్జ్ శేఖర్ మాస్టర్ చొక్కా విప్పేయగా, అనసూయ సైతం జాకెట్ తీసేసింది. ఇది వివాదాస్పదం అయ్యింది. విమర్శలను అనసూయ తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. సీజన్ 2లో అనసూయ కొంచెం పద్దతిగా కనిపిస్తుంది. తాజాగా చీర కట్టులో మెస్మరైజింగ్ ఫోటో షూట్ చేసింది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
Also Read : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ..