Anasuya Bharadwaj: ‘జబర్దస్త్'(Jabardasth ) షో ద్వారా యాంకర్ గా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా అనసూయ, ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అంతకు ముందు పలు న్యూ చానెల్స్ లో ఎంటర్టైన్మెంట్ విభాగం లో స్టార్ హీరోలు, హీరోయిన్లను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండేది అనసూయ(Anasuya Bhardwaj). ఆ సమయంలో ఈమెకు పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. ఎప్పుడైతే ఆమె ‘జబర్దస్త్’ లోకి అడుగుపెట్టిందో, ఆమె జాతకమే మారిపోయింది. వరుసగా ఎంటర్టైన్మెంట్ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ఉన్నత స్థాయికి వెళ్లిన అనసూయ, అడవి శేష్ హీరో గా నటించిన ‘క్షణం’ అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసింది. చూసేందుకు హీరోయిన్ లుక్స్ తో కనిపించే అనసూయ, హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని అంతా ఊహించారు కానీ, విలన్ గా ఎంట్రీ ఇచ్చి షాక్ కి గురి చేసింది.
Also Read: చైల్డ్ ఆర్టిస్ట్ గా 24 సినిమాలతో ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం హీరోయిన్ గా హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్..
ఆ తర్వాత అనేక ముఖ్యమైన రోల్స్, విలన్ రోల్స్ చేస్తూ బాగా పాపులారిటీ ని సంపాదించిన అనసూయ ‘పుష్ప’ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె రేంజ్ వేరు. ఒకప్పుడు బుల్లితెర పై యాంకర్ గా వ్యవహరించిన అనసూయ, ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ హోదాలో న్యాయనిర్ణేతగా వచ్చే రేంజ్ కి ఎదిగింది. స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్ 2’ ప్రోగ్రాం లో అమ్మాయిల తరుపున గేమ్ చేంజర్ గా పాల్గొంటుంది. మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఆ సీజన్ లో అబ్బాయిలు విజేతలుగా నిలిచారు. ఈ సీజన్ లో ప్రస్తుతానికి అమ్మాయిలు పై చేయి సాధించారు. ఈ వారం లో ఎవరు గెలుస్తారో చూడాలి. రేపు, ఎల్లుండి ప్రసారమయ్యే ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్స్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ ప్రోమో కొంచెం ఫన్, కొంచెం ఫైర్ తో సాగిపోయింది. ఈ వారం మూవీ థీమ్ మీద నడుస్తుంది కాబట్టి కంటెస్టెంట్స్ అందరూ పాపులర్ మూవీ క్యారెక్టర్స్ తో మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈ ప్రమో లో శేఖర్ మాస్టర్(Shekar Master) వేసిన ఒక పంచ్ కి అనసూయ కాస్త నొచ్చుకున్నట్టుగా అనిపించింది. శేఖర్ మాస్టర్ స్టేజి మీదకు రాగానే యాంకర్ శ్రీముఖి హీరో గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది . అప్పుడు శేఖర్ మాస్టర్ మరి హీరోయిన్ ఎవరు అని అడగగా, ఇక్కడ కనిపిస్తుంది కదా మాస్టర్ అని అనసూయ వైపు చూపిస్తుంది శ్రీముఖి. అప్పుడు అనసూయ కాస్త పొగరుగా శేఖర్ మాస్టర్ వైపు చూడగా, ‘చూసింది చాలులే ..సినిమాల్లో యాక్ట్ చెయ్యి అదేదో’ అని అంటాడు. అప్పుడు అనసూయ ‘స్క్రిప్ట్ లో నుండి దాటుతున్నావ్..తర్వాత చెప్తా నీ పని’ అని అంటుంది. ఈ ప్రోమో వీడియో ని మీరు కూడా చూడండి.
