Homeఎంటర్టైన్మెంట్Anasuya Private Matter Leak : గూగుల్ లో అనసూయ గురించి కుర్రాళ్ళు ఏమి వెతుకుతున్నారో...

Anasuya Private Matter Leak : గూగుల్ లో అనసూయ గురించి కుర్రాళ్ళు ఏమి వెతుకుతున్నారో తెలుసా? ప్రైవేట్ మేటర్ లీక్ చేసిన స్టార్ యాంకర్

Anasuya Private Matter Leak : అనసూయ భరద్వాజ్ ఒకప్పటి జబర్దస్త్ యాంకర్. ఆ షో వేదికగా అమ్మడు స్టార్డం తెచ్చుకుంది. ఎంబీఏ చదివిన అనసూయ ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ జాబ్ చేసింది. కార్పొరేట్ సెక్టార్ వదిలేసి న్యూరీడర్ అవతారం ఎత్తింది. సాక్షి ఛానల్ లో అనసూయ న్యూస్ రిపోర్టర్ జాబ్ చేయడం విశేషం. ఒకదశలో ఆమె సినిమా ప్రయత్నాలు కూడా చేసింది. అవకాశాలు రాకపోవడంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. ఆమెకు లక్ కుదిరి జబర్దస్త్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యింది. దానికి తోడు తెలుగు టెలివిజన్ ఆడియన్స్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన అనసూయ అనతి కాలంలో పాపులారిటీ రాబట్టుకుంది.

అనసూయను వివాదాలు సైతం ఫేమస్ చేశాయి. తన డ్రెస్సింగ్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ పట్టించుకోలేదు. నా డ్రెస్ నా ఇష్టం, జడ్జి చేయడానికి మీరెవరు అంటూ ఘాటైన సమాధానం చెప్పేది. స్టార్ యాంకర్ హోదా ఆమెకు సినిమా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. అనసూయకు విలక్షణ పాత్రలు దక్కుతున్నాయి. కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ కూడా చేసింది. ప్రస్తుతం అనసూయ బిజీ యాక్ట్రెస్. కొన్నాళ్ళు అనసూయ బుల్లితెరకు దూరమైంది. గత ఏడాది తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

Also Read : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

అదే సమయంలో ఇంస్టాగ్రామ్ లో గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్ ఇస్తుంది. కాగా అనసూయకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేసిన పాడ్ క్యాస్ట్ లో అనసూయ పాల్గొంది. ఈ సందర్భంగా అనసూయకు సంబంధించిన ఏ విషయం గురించి నెటిజెన్స్ ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారో.. ప్రదీప్ బయటపెట్టాడు. మెజారిటీ నెటిజన్స్ అనసూయ వయసు ఎంత అని సెర్చ్ చేస్తున్నారట. ఆ విషయం తెలిసిన అనసూయ ఆశ్చర్యపోయింది. నాకు వయసుతో సంబంధం ఏముంది? 50 ఏళ్ళు వచ్చినా అందంగా ఉంటానని అనసూయ విశ్వాసం వ్యక్తం చేసింది.

మే 15న జన్మదినం జరుపుకున్న అనసూయ 40వ ఏట అడుగుపెట్టింది. సుశాంక్ భరద్వాజ్ ని అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం. అందుకే అనసూయను హేటర్స్ ఆంటీ అని ట్రోల్ చేస్తుంటారు. ఆంటీ అంటే ఆమెకు చిర్రెత్తుకొస్తుంది. అనసూయ బికినీ ధరించడానికి కూడా వెనుకాడదు. ఆమెలో ఆత్మవిశ్వాసం అంత మెండుగా ఉంటుంది. ఇటీవల అనసూయ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. దీని ధర కోట్లలో ఉందని సమాచారం.

Exit mobile version