Nicholas Pooran Retirement: నికోలస్ పూరన్ కు రిషభ్ పంత్ అభినందనలు తెలిపాడు. పూరన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అతడికి రిషభ్ పంత్ అభినందనలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ లో పూరన్ సత్తా చాటడని కొనియాడాడు. వెస్టిండీస్ క్రికెట్ కోసం నువ్వు చేసిన ప్రతిదానికీ అభినందనలు. ముందుకు సాగే ప్రయాణంలో నీకు ఎల్లప్పుడూ విజయమే దక్కాలని కోరుకుంటున్నాడు. నువ్వంటే నాకు ఎల్లప్పుడూ గౌరవం అని పంత్ తన ఇన్ స్టా స్టోరీలో పంచుకున్నాడు.