Anasuya viral pics: విషయం ఏదైనా ఓపెన్ గా షేర్ చేస్తుంది అనసూయ. తాజాగా ఈ స్టార్ యాంకర్ నైట్ పార్టీలో చిల్ అయ్యిందట. సదరు ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకున్న అనసూయ… ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది..
సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్(ANASUYA BHARADWAJ) చాలా యాక్టీవ్. వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. అనసూయ పోస్ట్స్ కి విపరీతమైన స్పందన దక్కుతుంది. ఫ్యాన్స్, హేటర్స్ కామెంట్స్ తో విరుచుకుపడతారు. తనపై అనుచిత కామెంట్స్ చేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంది అనసూయ. హద్దులు దాటి ప్రవర్తిస్తే… సైబర్ కేసులు పెడుతుంది. అనసూయ పెట్టిన కేసులకు జైలుపాలైన ఆకతాయిలు కూడా ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో అనసూయను 1.6 మిలియన్ నెటిజెన్స్ ఫాలో అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేసే పోస్ట్స్ గమనిస్తూ స్పందిస్తూ ఉంటారు.
Also Read: స్టార్ హీరోలపై హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు, రాత్రికి రమ్మని ఇబ్బంది పెట్టారంటూ సంచలనం
తాజాగా అనసూయ నైట్ పార్టీలో పాల్గొన్నదట. తన ఫ్రెండ్స్ తో కలిసి గర్ల్స్ నైట్ లో ఎంజాయ్ చేసింది అనసూయ. వారితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. మీరు దీన్ని గర్ల్స్ నైట్ అనుకోవచ్చు… కానీ నేను థెరపీ అనుకుంటున్నాను. మండే డన్… అంటూ ఒక కామెంట్ పోస్ట్ చేసింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం ఉపశమనం… అన్న అర్థంలో అనసూయ సదరు కామెంట్ చేసింది. అటు నటిగా ఇటు బుల్లితెర స్టార్ గా అనసూయ ఫుల్ బిజీ. ఆమె చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. విలక్షణ పాత్రలు దక్కుతున్నాయి. అదే సమయంలో లీడ్ రోల్స్ కూడా చేస్తుంది అనసూయ.
ఇటీవల బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చింది. ఓ రెండేళ్లు టెలివిజన్ షోలకు దూరమైన అనసూయ తిరిగి షోలు చేస్తుంది. స్టార్ మాలో ప్రసారమైన కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో అనసూయ జడ్జిగా వ్యవహరించింది. అమ్మాయిల ప్రతినిధిగా ఆమె ఈ షోలో ఉన్నారు. గత ఏడాది కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 1 ముగిసింది. ఈ ఏడాది సీజన్ 2 సైతం సక్సెస్ఫుల్ గా ముగించారు. అబ్బాయిలకు ప్రతినిధిగా శేఖర్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ షోలో సందడి చేస్తుంది. రోజా సైతం రీఎంట్రీ ఇవ్వగా… అనసూయ, రోజా డ్రామా జూనియర్స్ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
Also Read: హైపర్ ఆది వల్లే జబర్దస్త్ వదిలేశా, వెళ్ళేటప్పుడు వేడుకున్నా, అనసూయ సంచలన కామెంట్స్
అనసూయ రీఎంట్రీతో టెలివిజన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. జబర్దస్త్ 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణంలో మెగా ఎపిసోడ్ ప్లాన్ చేశారు. జబర్దస్త్ లో పని చేసిన పలువురు కమెడియన్స్, యాంకర్స్ ఈ ఎపిసోడ్ లో కనిపించనున్నారు. 2022లో జబర్దస్త్ కి దూరమైన అనసూయ మెగా ఎపిసోడ్ లో పాల్గొనడం విశేషం. తాను జబర్దస్త్ మానేయడానికి హైపర్ ఆదినే కారణమని ఈ ఎపిసోడ్ లో అనసూయ ఓపెన్ అయ్యింది. హైపర్ ఆది మీద ఆరోపణలు చేసిన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతుంది.
View this post on Instagram