Anasuya Bharadwaj: సోషల్ మీడియా లో తరచూ బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఉండే అనసూయ రీసెంట్ గా విజయ్ దేవరకొండ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ లో ఉంటూ ఒక ప్రముఖ హీరో మీద ఇలాంటి కామెంట్స్ ఎలా చెయ్యగల్తున్నావ్ ఆంటీ అంటూ ట్విట్టర్ లో ఈమె నెటిజెన్స్ నుండి తీవ్రమైన నెగటివిటీ ని ఎదురుకుంటుంది.
ఇదంతా పక్కన పెడితే ఈమె రీసెంట్ గా ప్రముఖ నటుడు సముద్ర ఖని తో కలిసి ‘విమానం’ అనే చిత్రం లో ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఆమెకి సంబంధించిన లుక్ కూడా రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమాలో ఆమె పోషించిన ఈ పాత్ర ‘రంగస్థలం’ చిత్రం లోని ‘రంగమ్మ అత్త’ పాత్ర తర్వాత ది బెస్ట్ గా ఉండబోతుందని ఆమె బలంగా నమ్ముతుంది.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రం లో జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ ఒక ముఖ్యమైన పాత్రని పోషించాడు. నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన లుక్ ని విడుదల చేసింది అనసూయ. ‘ధనా..ఒక్కసారి ఇలా రా..అందరూ నీకోసం వెయిటింగ్ ఇక్కడ’ అంటూ ఒక పోస్టు వెయ్యగా అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో మరియు పోస్టర్స్ ఆడియన్స్ లో మంచి ఆసక్తిని కలిగించింది. తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధం గురించి ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కింది. కుటుంబ కథా చిత్రాలను మెచ్చే ప్రతీ ఒక్కరికి ఈ సినిమా ఎంతగానో నచ్చుతుంది అనే బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్.
Happy happy birthday Dhanaaa ❤️ Can’t wait for people to witness Daniel!! @DhanrajOffl https://t.co/29flw8WB97
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 7, 2023