
Anasuya Bhardwaj : అనసూయ బుల్లితెరకు దూరమై నెలలు గడుస్తుంది. ఆమెను ఒక వర్గం ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. ఫస్ట్ జబర్దస్త్ కి దూరమైన అనసూయ అనంతరం మిగతా షోల నుండి కూడా తప్పుకున్నారు. జబర్దస్త్ నుండి ఎందుకు తప్పుకున్నారంటే… బిజీ షెడ్యూల్స్ కారణం అన్నారు. రెండేళ్లుగా జబర్దస్త్ మానేయాలి అనుకుంటున్నాను. అగ్రిమెంట్ ముగియడంతో ఇప్పుడు మానేశాను. జబర్దస్త్ నిర్మాతలు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆదరించారంటూ కొని డిప్లొమాటిక్ సమాధానాలు చెప్పింది. ఒక చిన్న అసహనం మాత్రం బయటపెట్టింది.
జబర్దస్త్ కమెడియన్స్ బాడీ షేమింగ్ కి పాల్పడతారు. వారి కామెంట్స్ హర్ట్ చేసేవి. మన కోపం,అసహనం ఎపిసోడ్లో చూపించరు. అది నాకు బాధ కలిగించిందని ఆమె వెల్లడించారు. అయితే అంతకు మించిన కారణాలు, ఆమె మనసులో ఆగ్రహావేశాలు ఉన్నాయని తాజాగా బటయపడింది. అభిమానులతో ఆన్లైన్ చాట్ లో పాల్గొన్న అనసూయ… షాకింగ్ కామెంట్స్ చేశారు. బుల్లితెర షోల మీద ఆమె విరుచుకుపడ్డారు. ఓ అభిమాని మీరు మళ్ళీ బుల్లితెరకు ఎప్పుడు తిరిగి వస్తారని? అడిగారు.
‘ఎప్పుడైతే టీఆర్పీల కోసం డబుల్ మీనింగ్, అవమానకర స్టంట్స్, ట్రిక్స్ లేకుండా పోతాయో అప్పుడు వస్తాను. బహుశా నేను మళ్ళీ రాకపోవచ్చు,’ అని సమాధానం చెప్పారు. టీఆర్పీ కోసం డబుల్ మీనింగ్స్ తో, తప్పుదోవ పట్టించే ప్రోమోలు, యాంకర్స్ ని, ఆడవాళ్లను అవమానపరిచే జోక్స్, కామెంట్స్ లేకుండా ఉంటాయో అప్పుడు నేను వస్తాను. అది జరగని పని కాబట్టి ఇక నేను టీవీ షోలకు వచ్చేది లేదని అనసూయ పరోక్షంగా చెప్పారు. ఒక్క కామెంట్ బుల్లితెర షోల మీద ఆమెకు ఎంతటి ఆగ్రహం ఉందో తెలియజేసింది. ముఖ్యంగా ఆమె జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలను టార్గెట్ చేసి అన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒక దశలో అనసూయను హైపర్ ఆది బాగా ఆడుకున్నాడు. తన స్కిట్లో కొన్ని కామెంట్స్, కౌంటర్లు ఆమె మీద కూడా రాసుకునేవాడు. అనసూయ ఆయనకు కోపరేట్ చేసేది. లోపల రగిలిపోతూ ఆ స్కిట్స్ లో అనసూయ నటించారని ఇప్పుడు తెలిసొస్తుంది. జబర్దస్త్ లో ఆమె నవ్వులన్నీ నటనే అని తేలిపోయింది. సదరు కమెడియన్స్ ని ఎంకరేజ్ చేసిన మల్లెమాల సంస్థను కూడా పరోక్షంగా టార్గెట్ చేశారు. ప్రస్తుతం అనసూయ ఓన్లీ సినిమాలు చేస్తున్నారు. ఆమె చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. హీరోయిన్, విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు.
