
Pawan Kalyan- Thota Chandrasekhar: నిన్న మొన్నటి వరకు జనసేనలో తోట చంద్రశేఖర్ ఒక వెలుగు వెలిగారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ ఎప్పుడు కావాలంటే అప్పుడు టికెట్ ఇచ్చింది. అయినా ఆయన జనసేనను వీడారు. కేసిఆర్ పెట్టిన బిఆర్ ఎస్ పార్టీలో చేరారు. మరి పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఆయన పరిస్థితి ఏమిటి? అనే దానిపై ప్రత్యేక కథనం.
మెగా బ్రదర్స్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో తోట చంద్రశేఖర్ ఒకరు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత 2009లో చిరంజీవి ప్రారంభించిన ప్రజా రాజ్యం పార్టీ లో చేరారు. పార్టీ పెట్టేందుకు క్రియాశీలకంగా పని చేశారు. గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఒడి పోయారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేనలో కూడా క్రియాశీలకంగా ఉన్నారు.
జనసేన లో నంబర్ 2 పై గుర్రుగా ఉన్నట్టు చెబుతూ కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో దూరంగా ఉన్నారు. ఆ తరువాత కెసిఆర్ ప్రారంభించిన బిఆర్ఎస్ ఏపీ శాఖకు అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతున్న తోట చంద్రశేఖర్, ఆ మేరకు పరిస్థితులు లేవని ఒక స్పష్టతతో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు. కనీసం కార్యకర్తల స్థాయిలో కూడా పార్టీ లేదనేది ఆయనకి తెలుసు. మరి జనసేనకు దూరమవడం వ్యూహాత్మకంగానే కనబడుతుంది. జనసేనానిని ముఖ్య మంత్రిగా చేయాలనేది ఆయన అభిమతమా?. అదే అయితే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? జనసేనను బీజేపీకి దూరంగా జరిపేందుకు కెసిఆర్ వేసిన ఎత్తుగడ?. ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అయితే తోట చంద్రేఖర్ తిరిగి స్వంత గూటికి చేరతారా? లేదా బీఆర్ఎస్ లో కీలకంగా మరతారో వేచి చూడాల్సిందే.