Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ టాలీవుడ్ గ్లామర్ ఐకాన్ అని చెప్పొచ్చు. బుల్లితెరపై ట్రెండ్ సెట్టర్. అనసూయ వచ్చే వరకు తెలుగులో హాట్ యాంకర్స్ లేరు. స్కిన్ షో చేయడం అనే సంప్రదాయం లేదు. యాంకర్ అంటే నిండైన బట్టల్లో కనిపించాలని అన్నట్లు తీరు ఉండేది. జీన్స్, టాప్స్ ధరించినా ఫుల్ కవర్ చేసేవారు. జబర్దస్త్ షోతో అనసూయ గ్లామర్ యాంగిల్ చూపించింది. అనసూయ తెగింపుకు జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. జబర్దస్త్ షో సక్సెస్ లో అనసూయ పాత్ర కూడా ఉంది.
అనసూయ స్ఫూర్తితో రష్మీ గౌతమ్, శ్రీముఖి, విష్ణుప్రియ, వర్షిణి గ్లామరస్ యాంకర్స్ గా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. అనసూయ డ్రెస్సింగ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె వెనక్కి తగ్గింది లేదు. పైగా తన బట్టల గురించి మాట్లాడిన వాళ్లకు తిరిగి కౌంటర్స్ ఇచ్చింది. అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ మానేసింది. దాంతో ఫ్యాన్స్ చాలా ఆందోళన చెందారు. కంగారు పడాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంది.
ఇంస్టాగ్రామ్ వేదికగా తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా ఫ్రాక్, టాప్ ధరించి టీనేజ్ గర్ల్ లుక్ లో షాక్ ఇచ్చింది. అనసూయ గ్లామర్ చూస్తే వయసు పెరుగుతుందా తగ్గుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. అనసూయ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ఇక ఫాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
అనసూయ నటిగా ఫుల్ బిజీగా ఉన్నారు. 2023లో అనసూయ మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో నటించారు. ఒక్కో చిత్రంలో ఒక్కో విభిన్నమైన పాత్ర చేసింది. అనసూయ నటిస్తున్న పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఆమె ఖాతాల్లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. ఈ భారీ పాన్ ఇండియా మూవీలో దాక్షాయణిగా మరోసారి సందడి చేయనుంది. పుష్ప 2లో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే…