Anasuya Bharadwaj: జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది ఆర్టిస్టులు తమ అదృష్టాన్ని మార్చుకున్నారు. ఉపాధిని పొందారు. ఎక్కడ లేని గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో కొందరు వెళ్లిపోతుంటే కొందరు మాత్రం జబర్దస్త్ చెట్టు నీడనే సేద తీరుతున్నారు. అలాంటి రాకెట్ రాఘవ, చలాకీ చంటి ఉన్నారు. ఇంకా చాలా మంది సీనియర్లు జబర్దస్త్ ను వీడి ఇతర చానళ్లకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం జబర్దస్త్ నవ్వుల పూలు పూయించడం లేదని విమర్శలు వస్తున్నాయి. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు మొదట్లో ఉన్న క్రేజీ ప్రస్తుతం జబర్దస్త్ కు లేదని తెలుస్తోంది.

ఒక్కొక్కరుగా సీనియర్లు దూరం అవుతున్నారు. ఇప్పటికే చమ్మక్ చంద్ర, అదిరే అభి, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వారు టాటా చెప్పేశారు. ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా గుడ్ బై చెబుతున్నట్లు తెలిసింది. దీంతో జబర్దస్త్ ఆర్టిస్లుల్లో అయోమయం నెలకొంది. ఇన్నాళ్లు అనసూయ ఓ బలంలా ఉన్నా ఆమె కూడా దూరం కావడంతో అందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేరకు జరిగిన స్కిట్లో కన్నీరు పెట్టుకున్నారు. కానీ అనసూయ మాత్రం కామన్ గా తీసుకుంది. ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు.
Also Read: Nithya Menen: నిత్యా మీనన్ పెళ్లి.. నిజం చెప్పేసిన కేరళ కుట్టి
దీనిపై సీనియర్ ఆర్టిస్టులు రాకెట్ రాఘవ, చలాకీ చంటి వంటి వారు సెటైర్లు వేశారు. జబర్దస్త్ నుంచి ఎంత మంది వెళ్లినా కొత్తవారితో షోను సమర్థంగా నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జబర్దస్త్ ఇన్నాళ్లు చెట్టులా నీడనిచ్చినా అనసూయలో కనీసం ఆ గురుతర బాధ్యత కూడా కనిపించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్జి ఇంద్రజ సైతం కన్నీటి పర్యంతమైంది. జబర్దస్త్ నుంచి ఇలా చాలా మంది బయటకు వెళ్లడంతో బాధగా ఉందని కన్నీరు కార్చారు. కానీ అనసూయ మాత్రం ఏ మాత్రం చలించలేదు.

అనసూయ బయటకు వెళ్లడానికి కారణాలు వేరే ఉన్నాయి. విభేదాలు ఒకటైతే పారితోషికం రెండో సమస్యగా మారింది. అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతోనే చాలా మంది జబర్దస్త్ నుంచి వెళ్తున్నారు. మల్లెమాల యాజమాన్యం మాత్రం ఏ మాత్రం బెదరడం లేదు. సుడిగాలి సుధీర్ వెళ్తానంటే మాత్రం అతడిని ఆపాలని చూసినా సుధీర్ వినలేదని తెలిసింది. మిగతా వారి విషయంలో పోతో పోనీ అనే ధోరణితోనే ఉండటంతో వారు జబర్దస్త్ ను వీడినట్లు ప్రచారం సాగుతోంది. అనసూయ కన్నీరు పెట్టకపోవడానికి కారణాలు ఏంటనే దానిపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షోలో ఎన్నోమార్లు కన్నీరు పెట్టుకున్న అనసూయ ఇప్పుడు ఎందుకు కన్నీరు పెట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
Also Read:Bimbisara Pre Release Event- NTR: వస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. నందమూరి ఫ్యాన్స్ కి పండుగే
[…] […]
[…] Also Read: Anasuya Bharadwaj: జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్… […]