https://oktelugu.com/

Anasuya Bharadwaj : భర్తను వదిలేసి పోతా అంటున్న అనసూయ… షాకింగ్ డెసిషన్!

భర్తని వదిలేసి ఒంటరిగా వెకేషన్ కి వెళ్లడానికి రెడీ అయిపోవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు అనసూయ పుష్ప 2 తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. పుష్ప 2 లో దాక్షాయణిగా విలన్ రోల్ లో అలరించనుంది.

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2024 / 08:00 PM IST

    Anasuya Bharadwaj

    Follow us on

    Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ కు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో… అదే రేంజ్ లో నెగిటివిటీ కూడా ఉంది. అనసూయ వ్యాఖ్యలు, తన డ్రెస్సింగ్ స్టైల్ తరచుగా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటాయి.అయితే అనసూయ ట్రోల్స్ ని అసలు లెక్కచేయదు. పైగా విమర్శలు చేసేవాళ్ళకు ఘాటుగా కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

    నిత్యం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. ఆమెకు సంబంధించిన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే రీసెంట్ గా చిట్ చాట్ నిర్వహించింది అనసూయ. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో లైవ్ వీడియో లో ముచ్చట్లు పెట్టింది. తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ నుంచి అనసూయకు ఒక క్రేజీ ప్రశ్న ఎదురైంది.

    దానికి అనసూయ ఆసక్తికర జవాబు ఇచ్చింది. అనసూయ సాధారణంగా ఖాళీ సమయం దొరికితే, భర్తతో కలిసి టూర్స్ కి వెళుతూ ఉంటుంది. ఫ్యామిలీతో వెకేషన్స్ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ‘ మీరు ఒక్కసారైనా ఒంటరిగా ట్రిప్ ప్లాన్ చేయొచ్చు కదా అని ప్రశ్నించాడు. అనసూయ స్పందిస్తూ .. నిజానికి సింగిల్ గా బయటకు వెళ్లాలంటే ఒకప్పుడు పిచ్చ భయం వేసేది .. కానీ ఇప్పుడు ఆలోచిస్తా అని చెప్పింది.

    పైగా సోలో ట్రిప్ కోసం ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వమని ఆ అభిమానిని కోరింది. అనసూయ సింగల్ గా ట్రిప్ కి వెళ్తాను అని అలా చెప్పిందో లేదో .. కొందరు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. భర్తని వదిలేసి ఒంటరిగా వెకేషన్ కి వెళ్లడానికి రెడీ అయిపోవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు అనసూయ పుష్ప 2 తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. పుష్ప 2 లో దాక్షాయణిగా విలన్ రోల్ లో అలరించనుంది.