Anasuya Bharadwaj Saree Controversy: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలతో ఒకరు అనసూయ(Anasuya Bharadwaj0. సమాజం లో జరిగే అంశాలపై ఈమె వెర్షన్ వాదనలను వినిపించడం లో ఎప్పుడూ ముందు ఉంటుంది. కొంతమంది ఈమె వాదనలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వ్యతిరేకించే వాళ్ళు అత్యధిక శాతం ఉంటారు. ఈమె ఏ పోస్ట్ పెట్టిన దాని క్రింద నెగెటివ్ కామెంట్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. అందుకే ఆమె అనేక సార్లు తన పై నెగెటివ్ కామెంట్స్ చేసేవారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసింది. ఇదంతా పక్కన పెడితే శివాజీ హీరోయిన్స్ ధరించే దుస్తులపై కామెంట్స్ చేయడం , వాటికి అనసూయ కౌంటర్లు ఇవ్వడం కొద్దీ నెలల క్రితం ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూశాము . ఈ వివాదం ముగిసిన అధ్యాయం అని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఆమె ఈ అంశం పై చేసిన కామెంట్స్ సంచలనం గ మరింది.
ఒక నెటిజెన్స్ మాట్లాడుతూ ‘శివాజీ దెబ్బకి అనసూయ ఇప్పుడు చీరలు కట్టుకొనే తిరుగుతుంది’ అని అంటాడు. దానికి అనసూయ కౌంటర్ ఇస్తూ ‘తప్పు తప్పు!.. శివాజీ గారే చీర అనే వస్త్రాన్ని మొట్టమొదట సృష్టించారు. ఆయన సృష్టించిన చీర ని కట్టుకొని తిరుగుతున్నా అనసూయ అని అనాలి. ఎందుకంటే అంతకు ముందు మేము చీరలే కట్టుకోలేదు కదా’ అంటూ మండిపడింది. ఆమె వ్యంగ్యంగా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద దుమారం రేపుతోంది. కానీ నెటిజెన్స్ ఈ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కొంతమంది మద్దతుగా కూడా మాట్లాడుతున్నారు. ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఈమె యాంకర్ గా కొనసాగడం లేదు. సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉంది . త్వరలో మొదలయ్యే రామ్ చరణ్ , సుకుమార్ మూవీ లో కూడా ఈమె కీలక పాత్ర పోషించబోతుంది.