https://oktelugu.com/

Anasuya Bharadwaj: అనసూయ ఇంట్లో పూజలు… తెరపైకి కొత్త అనుమానాలు!

నెక్స్ట్ పుష్ప 2లో దర్శకుడు సుకుమార్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. పుష్ప 2తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్స్ ద్వారా అనసూయ భారీగా ఆర్జిస్తోంది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 16, 2024 / 11:50 AM IST

    Anasuya Bharadwaj Performs Special Pooja With Family

    Follow us on

    Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఇంట్లో పూజలు జరిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ క్రమంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనసూయ నటిగా ఫుల్ బిజీ. చేతి నిండా చిత్రాలతో కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. పుష్ప 2లో అనసూయ విలన్ గా కనిపించనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సునీల్ సైతం విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ కనిపించనున్నారు. పుష్ప పార్ట్ 1 లో అనసూయను చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

    నెక్స్ట్ పుష్ప 2లో దర్శకుడు సుకుమార్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. పుష్ప 2తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేస్తున్నారు. మరోవైపు ప్రమోషన్స్ ద్వారా అనసూయ భారీగా ఆర్జిస్తోంది. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినందుకు ఆమెకు లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారని సమాచారం. ఆమె కెరీర్ మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. అయితే అనసూయ ఇంట్లో పూజలు చేయించడం విశేషంగా మారింది.

    నలుగురు పురోహితులు పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటే కుటుంబ సభ్యులతో పాటు అనసూయ ఈ పూజల్లో పాల్గొంది. కెరీర్లో మరింతగా ఎదగాలని. విజయాలు చేకూరాలని అనసూయ ఈ పూజలు చేయిస్తున్నట్లు సమాచారం. దీంతో వేణు స్వామి పేరు తెరపైకి వచ్చింది. వేణు స్వామి సలహా మేరకు అనసూయ ఈ పూజలు చేయిస్తుంది. ఇందులో ఆయన ప్రమేయం ఉందని కొందరు వాదిస్తున్నారు. దాంతో అనసూయ పూజల మేటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

    వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయిస్తే కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని నమ్మే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. రష్మిక మందాన, డింపుల్ హయాతి, నిధి అగర్వాల్ తో పాటు పలువురు హీరోయిన్స్ వేణు స్వామి చేత పూజలు చేయించారు. కాబట్టి అనసూయను కూడా కొందరు అనుమానిస్తున్నారు. అయితే ఇందులో నిజం లేకపోవచ్చని పలువురు వాదిస్తున్నారు. అనసూయ తన అత్తమామలతో ఇంట్లో పూజలు చేసుకున్నారని సమాచారం.