Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj Latest Photos: రెండు జడల అనసూయ కిరాక్ ఫోజులు... నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్

Anasuya Bharadwaj Latest Photos: రెండు జడల అనసూయ కిరాక్ ఫోజులు… నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్

Anasuya Bharadwaj Latest Photos: అనసూయ భరద్వాజ్ సరికొత్త స్టైల్ ట్రై చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీ ధరించిన ఈ స్టార్ యాంకర్ రెండు జడల్లో దర్శనమివ్వడం విశేషం. అనసూయ కిరాక్ ఫోజులు వైరల్ అవుతుండగా.. నెటిజెన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) కెరీర్ పీక్స్ లో ఉంది. అటు సినిమాలు ఇటు టీవీ షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. మరోవైపు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, ప్రమోషన్స్ ద్వారా ఆర్జిస్తోంది. నెలకు అనసూయ సంపాదన కోట్లకు చేరిందని సమాచారం. ఒకప్పుడు ఆర్థిక బాధలు చవిచూశానన్న అనసూయ లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది. ఇటీవలే హైదరాబాద్ లో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించింది. కుటుంబ సభ్యులతో గృహ ప్రవేశం చేసిన అనసూయ… సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Also Read: ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన!

చెప్పాలంటే జబర్దస్త్ అనసూయ ఫేట్ మార్చేసింది. అనతికాలంలో విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. గ్లామరస్ యాంకర్ ట్యాగ్ తో అనసూయ బుల్లితెర స్టార్ అయ్యింది. అనంతరం పలు షోలకు అనసూయ యాంకర్ గా వ్యవహరించింది. అనంతరం నటిగా మారి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం విలక్షణ పాత్రలు చేస్తూ అనసూయ బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. నటిగా బిజీ అయ్యాక అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. జబర్దస్త్ తో పాటు మిగతా షోల నుండి తప్పుకుంది. ఓ రెండేళ్లు అనసూయ యాంకరింగ్ చేయలేదు.

ఈ పరిణామం జబర్దస్త్ ఆడియెన్సుతో పాటు ఆమె ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. టీఆర్పీ స్టంట్స్ నచ్చడం లేదన్న అనసూయ.. ఇకపై షోలు చేయనని చెప్పడం కొసమెరుపు. అయితే అనసూయ గత ఏడాది రీ ఎంట్రీ ఇచ్చింది. స్టార్ మాలో ప్రసారం అయిన కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకి జడ్జిగా వ్యవహరించింది. ఇటీవల ముగిసిన కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2లో కూడా అనసూయ సందడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ షోలో అనసూయ ఎంటర్టైన్ చేస్తున్నారు.

మరోవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు. తాజాగా అనసూయ సరికొత్త లుక్ లో మెస్మరైజ్ చేసింది. రెండు జడలు ట్రై చేసిన అనసూయ కిరాక్ ఫోజులతో మైండ్ బ్లాక్ చేసింది. ఇక అనసూయ ఫోటోలు చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.

Exit mobile version