Anasuya Bharadwaj: బుల్లితెర తో పాటుగా వెండితెర మీద అదరకొడుతున్న అనసూయ ప్రస్తుతం చేతి నిండా సినిమా ఆఫర్స్ తో దూసుకెళ్తుంది.అదే సమయంలో ప్రొమోషన్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ద్వారా రెండు చేతులా భారీగా సంపాదిస్తుంది. ఇక ఖాళీ దొరికిన సమయంలో తన ఫ్యామిలీతో కలిసి ప్రపంచ యాత్రలు చేస్తూ, ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తూ ఉంటుంది.
తాజాగా తన ఫ్యామిలీతో కలిసి యూఎస్ లో పర్యటిస్తున్న అనసూయ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ , ఘిరాడెల్లి స్క్వేర్ వద్ద తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలు పాటుగా కుటుంబంతో ఎక్కువ సమయం కలిసి ఉండటం ఉత్తమం అనే అర్థం వచ్చేలా కామెంట్ పెట్టి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన అనసూయ అభిమానులు నైస్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ ఎంజాయ్ ది ట్రిప్ అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
అదే విధంగా గతంలో అనసూయ థాయిలాండ్ వెకేషన్ కి వెళ్ళినప్పుడు పెట్టిన బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే, దీనిపై మిశ్రమ స్పందన రావడంతో ఒక దశలో అనసూయ సీరియస్ అయ్యారు. అదే విధంగా సోషల్ మీడియాలో ఆంటీ అంటే అసలు తట్టుకోలేని అనసూయ ఆ విషయం పై కూడా అనేక సార్లు నెటిజన్లతో గొడవ పడ్డారు. ఏదో ఒక విధంగా అనసూయ వివాదాల్లో ఉంటున్నారు.
హాట్ హాట్ ఫొటోస్ తో అలరించే అనసూయ అప్పుడప్పుడు బోల్డ్ కామెంట్స్ కూడా చేస్తూ మీడియాలో హల్చల్ చేస్తుంది. హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో దాదాపు కొన్నేళ్ల పాటు సోషల్ మీడియా వార్ కొనసాగించిన అనసూయ రీసెంట్ గా దానికి ఎండ్ కార్డు వేయడానికి ప్రయత్నం చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే తాజాగా ఆమె నటించిన విమానం సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక పుష్ప లో షాకింగ్ రోల్ లో కనిపించిన అనసూయ ప్రశంసలు అందుకుంది. దీంతో పుష్ప 2 లో అనసూయ రోల్ పై భారీ ఆసక్తి నెలకొంది.
View this post on Instagram