Vishwak Sen Vs Sai Rajesh: లేటెస్ట్ సెన్సేషన్ బేబీ ఒక పక్క సరికొత్త రికార్డ్స్ వైపు పరుగులు పెడుతుండగా, మరోపక్క వివాదాలకు నిలయంగా మారిపోయింది. ఈ వివాదం లోకి హీరో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇవ్వడంతో ఇది మరింత ముదిరిందనే చెప్పాలి. గతంలో ఈ సినిమా దర్శకుడు సాయి రాజేష్ చేసిన వ్యాఖ్యలు గురించి విశ్వక్ రియాక్ట్ అవ్వటంతో అగ్నిలో ఆజ్యం పోసినట్లు అయ్యింది.
హృదయ కాలేయం సినిమాకు దర్శకత్వం వహించిన సాయి రాజేష్ కలర్ ఫోటో చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. బేబీ స్క్రిప్ట్ వినిపించేందుకు ఓ హీరో దగ్గరకు వెళితే, ఆ దర్శకుడు అయితే నేను కథ కూడా వినని అన్నాడని ఒక ప్రెస్ మీట్ లో సాయి రాజేష్ చెప్పారు. కానీ ఆ హీరో విశ్వక్ సేన్ అని మాత్రం చెప్పలేదు. దీని తర్వాత హీరో విశ్వక్ సేన్ దీనిపై పరోక్షంగా కౌంటర్ ఇస్తూ ‘ నో అంటే నో అందరికీ వర్తిస్తుంది. కాబట్టి కూల్ గా ఉండండి. అరిచి గోల చేయొద్దు. జస్ట్ రిలాక్స్ ‘ అంటూ సాయి రాజేష్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు .
దీనిపై సాయి రాజేష్ కూడా ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అది చల్లారిపోయిందని అనుకున్నారు. కానీ తాజాగా విశ్వక్ సేన్ ఈ వివాదం గురించి ఒక మూవీ ఈవెంట్ లో అసలేం జరిగిందో వివరించే ప్రయత్నం చేశాడు. ” ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు బిజీగా ఉంటారు. ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ లేనప్పుడు ఎదుటి వారి టైం ను వేస్ట్ చేయకూడదు అనుకుంటాం. ఆ కారణంతో ‘ కథ వినలేను, చేయలేను’ అని చెపుతాం. దానికి కొందరు ఫీల్ అవుతారు. దానికి నేనేమి చేయలేను.
అందరిని సంతోష పెట్టడానికి నేనేమి బిర్యానీని కాదు. సినిమా హిట్ అయితే తలెత్తుకోవటం తప్పేమి కాదు, కానీ అవతలి వాళ్ళని కించపరచకూడదు. అదొక్కటే బాధగా ఉంది. చిన్న సినిమా హిట్ అయితే అందరికీ సంతోషమే. వాళ్ళకి నా శుభాకాంక్షలు కూడా చెప్పను. డైరెక్టర్ గ్రూప్ లో సినిమా బాగుందని ఫస్ట్ మెసేజ్ నేనే చేశాను. కానీ కథ వినడానికి కూడా డైరెక్టర్ ని కలవలేదని ట్రోల్స్ చూశాను.
గంటసేపు చర్చించి చెప్పడం కంటే ముందే నో చెప్పడం బెటర్ అని చెప్పను” అంటూ అసలేం జరిగిందో వివరించాడు విశ్వక్ సేన్. నిజానికి ఈ విషయంలో ఇంత రచ్చ అవసరం లేదు. కలిసి మాట్లాడుకుంటే పోయే దానికి మీడియా ఎక్కి ఇద్దరు రచ్చ చేసుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. మరి దీనిని ఇంతటిదో వదిలేస్తారా లేదో చూడాలి.