Anasuya Bharadwaj: తరచూ వివాదాలతో సావాసం చేస్తుంది అనసూయ. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ పెడితే నెగిటివ్ కామెంట్స్ వెలువెత్తుతాయి. కెరీర్ బిగినింగ్ నుండి అనసూయ ఈ వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఇందుకు ఆమె ప్రవర్తన కూడా కారణం. ప్రధానంగా అనసూయ డ్రెస్సింగ్ వివాదాస్పదమైంది. జబర్దస్త్ లో ఆమె డ్రెస్సింగ్ హద్దులు దాటేసింది. బుల్లితెర షోల్లో మితిమీరిన స్కిన్ షో చేయడం సరికాదని ఆమెను పలువురు విమర్శించారు.
ఈ విమర్శలను అనసూయ తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది. నేను ఎటువంటి బట్టలు ధరించాలో డిసైడ్ చేయడానికి మీరెవరు. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి బట్టలైనా వేసుకుంటాను. నన్ను జడ్జ్ చేసే హక్కు మీకు లేదని అనసూయ ఓపెన్ గా చెప్పారు. తనపై వచ్చే ఆరోపణలకు అనసూయ స్పందించే తీరు కూడా ఆమెకు హేటర్స్ ని తయారు చేసింది. ఇక విజయ్ దేవరకొండను గెలికి వివాదాలు రాజేసింది. లైగర్ మూవీ ఫస్ట్ డేనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తూ అనసూయ పరోక్షంగా ట్వీట్ చేసింది.
అది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. సోషల్ మీడియాలో ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. మూడు రోజుల పాటు నాన్ స్టాప్ గా వాళ్లతో యుద్ధం చేసింది. కొందరి మీద సైబర్ కేసులు పెట్టింది. ఆ వివాదం సద్దుమణిగింది అందుకుంటే ఖుషి చిత్ర విడుదలకు ముందు మరలా విజయ్ దేవరకొండను ట్రోల్ చేస్తూ ట్వీట్ వేసింది. ఖుషి పోస్టర్స్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు ‘The’ అని పెట్టారు. దీన్ని అనసూయ తప్పుబట్టింది. దాంతో మరలా లొల్లి మొదలు.
విజయ్ దేవరకొండతో వివాదాల తర్వాత అనసూయ మీద సోషల్ మీడియా వ్యతిరేకత ఎక్కువైంది. అయితే ఈ నెగిటివిటీని అనసూయ ఎంజాయ్ చేయడం విశేషం. తనను విమర్శించేవాళ్ళు కుళ్ళుకునేలా అనసూయ పోస్ట్స్ పెడుతుంది. తాజాగా ఓ వీడియోతో తన హేటర్స్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. మీరు ఎంత ద్వేషించినా నా ప్రతి పోస్ట్ చూస్తున్నారు. నా ప్రతి పనిని ఫాలో అవుతున్నారు. కాబట్టి మీరు నా అభిమానులే… అంటూ వీడియో పోస్ట్ చేసింది. అనసూయ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక యాంకరింగ్ వదిలేసిన అనసూయ నటిగా కొనసాగుతుంది. ఈ ఏడాది రంగమార్తాండ, విమానం చిత్రాల్లో ఆమె నటించారు. త్వరలో పెదకాపు 1 చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. పుష్ప 2 వంటి భారీ చిత్రం ఆమె ఖాతాలో ఉంది…
View this post on Instagram